వీడియో : నడుము అందంతో చంపేసింది..అలనాటి హీరోయిన్ హాట్ హాట్‌గా!
అలనాటి బాలీవుడ్ అందాల తార ఊర్మిళ మటోండ్కర్ గురించి సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. ఈ 90 వ దశకం బ్యూటీ అప్పట్లో యువతని ఒకఊపు ఊపింది. చాలా కాలం గ్యాప్ తరువాత ఊర్మిళ తిరిగి ఇప్పుడు బాలీవుడ్ చిత్రంలో మెరవబోతోంది. ఇర్ఫాన్ ఖాన్ చిత్రం బ్లాక్ మెయిల్ లో 44 ఏళ్ల ఊర్మిళ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ వీడియో సాంగ్ తాజగా విడుదల చేసారు. బేవఫా బ్యూటీ అంటూ సాగే ఈ పాటలో ఊర్మిళ అందాలు ఆరబోస్తూ పెర్ఫామ్ చేసింది.
ఈ సాంగ్ కు ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఊర్మిళ చాలా కాలం తరువాత తన గ్లామర్ షో కు పదునుపెడుతుండడంతో ఆమె అభిమానులు ఎగబడి మరీ ఈ వీడియో సాంగ్ ని వీక్షిస్తున్నారు. ఊర్మిళ చెర కట్టులో తన నడుము అందాలతో యువతని ఆకర్షించే విధంగా ఈ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. కృతి కొల్హారి, ఇర్ఫాన్ ఖాన్ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











