అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
బాలీవుడ్ అందాల తార ఊర్వశీ రౌటేలా సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. ఆమె షేర్ చేసే వీడియోలు, ఫోటోలకు ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. అందాల ఆరబోస్తూ వయ్యారాల వల వేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. వెండితెరపైనే హద్దులు లేకుండా నటించే ఊర్వశీ.. సోషల్ మీడియాను మాత్రం ఖాళీగా వదులుతుందా. ఊర్వశీ అందాల ఆరబోతకు నెట్టిళ్లు మొత్తం వేడేక్కిపోవాల్సిందే.

బాలీవుడ్ ఐటం బాంబ్..
బాలీవుడ్‌లో జిస్మ్ 2లో కనిపించిన ఊర్వశీ అందాల ఆరబోతలో పీక్స్‌ను చూపించింది. రెచ్చిపోయి మరీ నటించేసింది. అలా ఊర్వశీకి బాలీవుడ్‌లో మంచి అవకాశాలే వచ్చాయి. ఎక్కువగా ఐటం సాంగ్‌లతోనే బాగా ఫేమస్ అయింది. అయితే ఇప్పుడు ఊర్వశీ తెలుగులోనూ రాబోతోంది.

స్పెషల్ సినిమా..
ఊర్వశీ రౌటేలా ఇప్పుడు తెలుగు తెరకు పరిచయం కాబోతోందన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సంపత్ నంది అందించిన కథతో తెరకెక్కుతోన్న చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బ్లాక్ రోజ్ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్, సాంగ్ ఇలా అన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి. కార్పోరేట్ నేరాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది.

గ్రీన్ ఇండియా చాలెంజ్ సైతం..
ఊర్వశీ రౌటేలా ఇక్కడ షూటింగ్ చేస్తోన్న తరుణంలోనే గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంది. తాను కూడా ఓ మొక్కను నాటింది.. డైరెక్టర్ సంపత్ నందికి, మిగతా టీం సభ్యులకు ఆ చాలెంజ్‌ను విసిరింది. అలా ఊర్వశీ సినిమా విడుదలకు ముందే అందరి మనసులను కట్టిపడేసింది.

పేరుకు అర్థమదే..
ఊర్వశీ (Urvashi)లో UR అంటే మీరు, మీ హృదయాలు.. Vashi అంటే నియంత్రించేది.. ఊర్వశీ అంటే మీ హృదయాలను కంట్రోల్‌లో ఉంచేదంటూ.. ఈ షూటింగ్ జరుగుతుంటే ఇప్పుడే తెలుసుకున్నా అంటూ ఊర్వశీ చెప్పుకొచ్చింది. తాజాగా ఊర్వశీ షేర్ చేసిన వీడియోల్లో ఎద అందాల మాత్రం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











