Urvashi Rautela: వాల్తేరు వీరయ్యాలో సాంగ్ మాత్రమే కాదు.. పవర్ఫుల్ పాత్రలో ఊర్వశి!

గ్లామరస్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. గతంలోనే ఆమెకు టాలీవుడ్ నుంచి కొన్ని ఆఫర్స్ వచ్చాయట. కానీ కంటెంట్ బాగుంటేనే సినిమాలు చేయాలని అనుకుంది. కథలు నచ్చకపోవడం వల్లనే మధ్యలో కొన్ని ఆఫర్లను కూడా రిజెక్ట్ చేసిందట.

ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి గ్యాప్ లేకుండా సినిమాలో చేయాలి అని ఆలోచిస్తోంది. రీసెంట్ గా తమిళంలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించిన ది లెజెండ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి ఆమెకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు అప్పట్లో ఒక టాక్ అయితే వినిపించింది.

Urvashi Rautela powerful charecter in Waltair Veerayya movie

అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో అమ్మడికి గ్యాప్ లేకుండా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఊర్వశి రౌటెలా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించబోతున్నట్లు ఇదివరకే ఓ క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా వాల్తేరు వీరయ్య సెట్స్ లో ఇటీవల మెహర్ రమేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన చిత్ర యూనిట్ సభ్యులు సెట్స్ లో ఊర్వశి కూడా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే మొదట వాల్తేరు వీరయ్య సినిమాలో ఆమె కేవలం ఒక ఐటెం సాంగ్ కోసం మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్లు కథనాలు విలువడ్డాయి. కానీ నిజానికి ఆమె కేవలం సాంగ్ కోసం మాత్రమే కాకుండా సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక నేవీ ఆఫీసర్ గా కథను మలుపు తిప్పే పాత్రలో ఊర్వశి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఎలాంటి పాత్రలో అయినా విభిన్నంగా కనిపించే ఊర్వశి ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో కూడా పవర్ఫుల్ నేవీ ఆఫీసర్ గా షాక్ ఇవ్వబోతోందట. ఇక ఈ సినిమాలో రవితేజ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన సన్నివేశాల్లో కూడా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఊర్వశి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బోయపాటి రామ్ పోతినేని సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే తెలుగులోనే మరొక సినిమా చేసేందుకు కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X