క్రికెటర్ పాండ్యతో హాట్ బ్యూటీ డేటింగ్.. హీరోయిన్ రియాక్షన్ చూడండి

Recommended Video

Urvashi Rautela Reacts On Relationship With Hardik Pandya || Filmibeat Telugu

పెరుగుతున్న ఆధునికత మీడియా పరిధిని మరింత విస్తృత పరుస్తోంది. ఈ నేపథ్యంలో పలు రకాల వార్తలు, గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ ఆటగాళ్లతో హీరోయిన్ల సన్నిహిత సంబంధాల తాలూకు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇలాంటి వార్తలపై సదరు హీరోయిన్స్ స్పందించక తప్పడం లేదు. తాజాగా ఇలాంటి ఓ వార్తపై మండిపడుతూ మీడియా ముందుకొచ్చింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా.

పాండ్యతో ఊర్వశి చెట్టాపట్టాల్

పాండ్యతో ఊర్వశి చెట్టాపట్టాల్

బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గతంలో చాలాసార్లు చెట్టాపట్టాలేసుకు తిరిగారు. పలు నైట్ పార్టీలు, ఈవెంట్లలో ఈ జోడీ కనిపించడంతో ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే కొంత కాలంగా పాండ్యతో దూరంగా ఉంటోంది ఊర్వశి.

 ఇంతలో మరోసారి రూమర్స్

ఇంతలో మరోసారి రూమర్స్

హార్దిక్ పాండ్యతో కట్ చేసుకున్నాక కూడా ఊర్వశి ఇంకా ఆయనతో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తోందని, ఓ సందర్భంలో ఆమె పాండ్యా సాయం కోరినట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ అంశంపై ఓ హిందీ వార్తా పత్రికలో కథనం కూడా ప్రచురితం కావడంతో మరోసారి హార్దిక్, ఊర్వశి డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

 భవిష్యత్ లో అనర్థాలు చోటు చేసుకుంటాయి

భవిష్యత్ లో అనర్థాలు చోటు చేసుకుంటాయి

వైరల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ వార్త ఊర్వశి రౌతేలా దృష్టికి రావడంతో ఆమె వెంటనే రియాక్ట్ అయింది. సదరు మీడియా ప్రచురించిన వార్తను ఊర్వశి తప్పుబడుతూ ఫైర్ అయింది. మీడియా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలను ప్రచురించొద్దని చెప్పుకొచ్చింది. వీటి వల్ల కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి వార్తల వల్ల భవిష్యత్ లో అనర్థాలు చోటుచేసుకునే ఛాన్స్ ఉందంటూ విరుచుకు పడింది ఊర్వశి.

ఊర్వశి రౌతేలా గురించి

ఊర్వశి రౌతేలా గురించి

బాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి రౌతేలా 'సనమ్‌రే' అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 4' నటించి కుర్రకారును ఫిదా చేసింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం 'పాగల్ పంటీ' అనే సినిమాలో నటిస్తోంది ఊర్వశి. జాన్ అబ్రహమ్, ఇలియానా, అనిల్ కపూర్, అర్షద్ వాసీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X