Bro: ఏపీ సీఎం పవన్ కల్యాణ్.. స్పీచులో కాలేసిన హీరోయిన్.. ఇదేంది 'బ్రో'

ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కల్యాణ్ స్పీచులు, సినిమాలు, ఆయన కనిపిస్తే చాలు ఈలలు, గోలతో రచ్చ చేయడమే కాదు.. సీఎం.. సీఎం.. అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. అలాంటిది ఇటీవల ఓ హీరోయిన్ పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభివర్ణించింది. అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిర్మాతలు ఎవరంటే?:మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం బ్రో (Bro Movie). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా, వివేక్ కూచిబోట్ల సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతం అందించారు.

Urvashi Rautela Tweet About Bro Movie And Says Pawan Kalyan Is AP CM

కీలక పాత్రలు:బ్రో సినిమా జూలై 28న అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పవన్ కల్యాణ్ తన ఎనర్జీతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్యూటిఫుల్ రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ, వింక్ సుందరి ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి రోహిణి, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు.

జూలై 27న ట్వీట్:బ్రో సినిమాలో బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌటెలా కూడా నటించిన విషయం తెలిసిందే. ఇందులోని మై డియర్ మార్కండేయ అనే పాటలో స్పెషల్ గా డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య తెలుగులో ఎక్కువగా కనిపిస్తుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ గురువారం అంటే జూలై 27న చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Urvashi Rautela Tweet About Bro Movie And Says Pawan Kalyan Is AP CM

సీఎంతో స్క్రీన్ షేర్:"మా చిత్రం Bro TheAvatar రేపు 28న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ కోపంతో ఉండే ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి రెండో అవకాశం వస్తే ఎలా ఉంటుదనేదే స్టోరి" అని ఊర్వశి రౌటెలా రాసుకొచ్చింది.

Urvashi Rautela Tweet About Bro Movie And Says Pawan Kalyan Is AP CM

సీఎం సీఎం అంటూ:ఊర్వశి రౌటెలా ట్వీటుతో పవన్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్న నెటిజన్లు, వైసీపీ అభిమానులు మాత్రం తెగ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు నీకు ఏపీ సీఎం ఎవరో కూడా తెలియదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఊర్వశి కూడా వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ పవన్ కల్యాణ్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఫ్యాన్స్ అంతా సీఎం.. సీఎం అని ఎప్పటిలానే అరిచారు.

Urvashi Rautela Tweet About Bro Movie And Says Pawan Kalyan Is AP CM

ఐటమ్ సాంగ్స్:సీఎం అంటూ పిలవడాన్ని పవన్ కూడా వారించారు. అది విని పవన్ నిజంగానే ఏపీ సీఎం అనుకుని ఊర్వశి అలా ట్వీట్ చేసిందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ది లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఊర్వశి తెలుగులోని మూడు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిం ఆకట్టుకుంది. బ్రోతోపాటు ఏజెంట్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X