'తొలిప్రేమ' ప్రీమియర్ షో టాక్ : వరుణ్ మళ్ళీ కొట్టాడుగా..!

Recommended Video

Tholiprema Overseas Premier Show Talk

వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ చిత్రం యుఎస్ లో విడుదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రేపు (శనివారం ) సందడి చేయనుంది. మరో మెగా సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్రం కూడా నేడే ఉండడంతో పోటీ వద్దని విడుదలని ఇలా సెట్ చేసుకున్నారు. కాగా యుఎస్ లో తొలిప్రేమ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ కు యుఎస్ ఆడియన్స్ థమ్స్ అప్ అనేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మరియు రాశి ఖన్నా నటన ఆకర్షణగా నిలవగా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి.

 మళ్ళీ ఫిదా

మళ్ళీ ఫిదా

వరుణ్ తేజ్ ఫిదా చిత్రం తో తొలి హిట్ అందుకున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి ఓవర్సీస్ ఫాన్స్ నిజంగానే ఫిదా అయ్యారు. అదే జోనర్ లో ఇంకాస్త ఎక్కువ ఎమోషనల్ కంటెంట్ తో తొలిప్రేమ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో కూడా యుఎస్ అభిమానులు ఫిదా అయ్యే అంశాలు చాలానే ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్

పాజిటివ్ పాయింట్స్

ఈ చిత్రంలో వరుణ్, రాశి ఖన్నా కు తగ్గట్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి కథ రాసుకున్నారు. ఇదే ఈ చిత్రానికి ప్రధాన బలం. మనిషికి ఎన్ని ప్రేమకథలు ఉన్నా తొలిప్రేమ ఎప్పటికి మరిచిపోలేనిది అని దర్శకుడు బలంగా చూపించాడు. వరుణ్, రాశి ఖన్నా మధ్య సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. థమన్ అందించిన సంగీతం మరీ ముఖ్యమంగా బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాల బావుంది.

 నెగిటివ్ పాయింట్స్

నెగిటివ్ పాయింట్స్

తొలిప్రేమ చిత్రంలో నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవలసి వస్తే ముందుగా సెకండ్ హాఫ్ గురించే మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్ తో ఇక్కసారిగా అంచనాలు పెంచేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఆ అంచనాలని అందుకోలేకపోయాడు. దీనితో ఇది సాధారణమైన సెకండ్ హాఫ్ అనే ఫీలింగ్ అభిమానుల్లో కలుగుతుంది. ఫిదా చిత్రంతో పోల్చుకున్నప్పుడు ఆ చిత్రానికి మాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. కానీ ఇందులో మాస్ కు చేరువయ్యే అంశాలు లేవని చెప్పొచ్చు.

వరుణ్, రాశి పెర్ఫామెన్స్

వరుణ్, రాశి పెర్ఫామెన్స్

తొలిప్రేమ చిత్రనికి ట్రైలర్ తోనే అంచనాలు పెరగడానికి కారణం రాశి, వరుణ్ మధ్య కెమిస్ట్రీ. చాలా బాగా ఈ చిత్రంలో రాశి, వరుణ్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, సరదా సన్నివేశాలు కుదిరాయి. వరుణ్ , రాశి మూడు షేడ్స్ ఉండే పాత్రల్లో అద్భుతంగా నటించారు.

 ఇక్కడ రేపు విడుదల

ఇక్కడ రేపు విడుదల

మొత్తంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కంటే యుఎస్ అభిమానులని ముందుగా పలకరించింది. తెలుగు రాష్ట్రలో శనివారం ఈ చిత్రం విడుదల కానుంది. యుఎస్ లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే లోకల్ గా కూడా మల్టి ప్లెక్స్ స్క్రీన్ లలో బాగా రాణించే అవకాశం ఉంది. ఇక సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటో విడుదలయ్యాకే తెలియనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X