లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్: సరిలేరును దాటిన అల.. 4 డాలర్లు పెరిగుంటే ఆ రికార్డు కూడా బద్దలే.!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ఈ పండుగ అంటే ప్రథమంగా గుర్తొచ్చేది కోడి పందాలు అనే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బరిలో కోడి పుంజులు పోట్లాడినట్లు.. తెలుగు తెరపై హీరోలు తమ తమ సినిమాలతో పోటీ పడుతుంటారు. గతంలో వచ్చిన అన్ని సంక్రాంతి సీజన్లలో ఇదే సీన్ కనిపించింది. ఈ ఏడాది కూడా వాటికీ ఏమాత్రం తగ్గకుండా రెండు భారీ సినిమాలు పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా అందిన కలెక్షన్ల ప్రకారం ఏ సినిమా ముందంజలో ఉందో తెలుసా.? వివరాలు మీకోసం.!

హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో వచ్చేశాడు
వరుసగా ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే అతడు అనిల్ రావిపూడితో చేసిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. విజయశాంతి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ సంగీతం అందించాడు. దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేశ్ దీన్ని నిర్మించాడు.

సరైన హిట్ ఇవ్వాలని గ్యాప్ తీసుకున్నాడు
‘నా పేరు సూర్య' వంటి ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేశాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అలాగే ఈ మూవీలో నవదీప్, సుశాంత్, టబు, సముద్రఖని, మురళీ శర్మ, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

అందులో తగ్గలేదు.. రికార్డులు ఆగలేదు
ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తాయని తెలిసినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రెండు చిత్ర యూనిట్లు కూడా పోటీ పోటీగా ప్రమోషన్లు చేస్తూ సినిమాల్లోని అప్‌డేట్స్‌ను ఒక్కొక్కటిగా వదిలాయి. ఈ క్రమంలోనే రెండు సినిమాల నుంచి విడుదలైన చాలా వాటికి రికార్డులు బద్దలైపోయాయి. దీంతో వీటిపై అంచనాలూ పెరిగిపోయాయి.

రెండింటి టాక్ ఇలా.. కలెక్షన్లు అలా..
‘సరిలేరు నీకెవ్వరు' శనివారం.. ‘అల.. వైకుంఠపురములో' ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ రెండు మూవీలకు మంచి టాక్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ రెండు సినిమాల గురించే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కలెక్షన్లూ బాగా వస్తున్నాయి. ఇప్పటికే సరిలేరు మొదటిరోజు రికార్డు కలెక్షన్లను రాబట్టింది.

సరిలేరు నీకెవ్వరును దాటిన అల
మన దేశంలో కంటే ముందుగా అమెరికాలో ఈ రెండు సినిమాలు విడుదలయిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్‌తో కలుపుకుని అక్కడ సరిలేరు నీకెవ్వరు 763 వేల డాలర్లు రాబట్టింది. అయితే, దీనిని అల.. వైకుంఠపురములో మూవీ దాటేసింది. తాజాగా అందుతున్న రిపోర్టులను బట్టి చూస్తే.. ఈ మూవీ ఇప్పటికే 800 వేల డాలర్లు కొల్లగొట్టేసిందని తెలుస్తోంది.
Recommended Video

4 డాలర్లు పెరిగుంటే ఆ రికార్డు కూడా బద్దలే.!
ఈ క్రమంలోనే సరికొత్త లెక్కలు తెరపైకి వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు యూఎస్‌లో 250 పైచిలుకు స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా టికెట్ ధర 21 డాలర్లు పలికింది. ఇక, వైకుంఠపురములో మాత్రం 175 లోకేషన్లలో 14 డాలర్ల టికెట్ ధరతో వచ్చింది. అయినప్పటికీ భారీగా కలెక్ట్ చేసింది. అదే ఈ సినిమా టికెట్ ధర 18 డాలర్లు ఉంటే ఒక మిలియన్ మార్కును దాటేసేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











