twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆటా’ పేరు చెప్పగానే.... నటి సురేఖ వాణి యూఎస్ఏ వీసా తిరస్కరణ!

    By Bojja Kumar
    |

    చికాగో సెక్స్ రాకెట్ తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్రం ప్రభావం చూపుతోంది. అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లే టాలీవుడ్ తారల్లో కొందరు వ్యభిచారం చేస్తున్నారని తేలడంతో నిబంధనలు మరింత కఠినతరం చేశారు. నిన్నమొన్నటి వరకు తెలుగు సంఘాల పేరు చెప్పగానే ఈజీగా వీసా జారీ చేసే అమెరికా కాన్సులేట్ అధికారులు.... ఇపుడు తెలుగు సంఘాల పేరు చెబితే చాలు వెంటనే వీసా తిరస్కరిస్తున్నారు.

    Recommended Video

    వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మరో ప్రముఖ నటి సంగీత
    సురేఖ వాణికి చేదు అనుభవం

    సురేఖ వాణికి చేదు అనుభవం

    తెలుగు నటి సురేఖా వాణి ‘ఆటా' వేడుకల్లో పాల్గొనేందుకు వీసా దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకుగురైంది. జూన్ 22 న అమెరికా వెళ్లేందుకు బీ1బీ2 (ట్రావెల్ వీసా) వీసా ఇంటర్వ్యూకు ఆమె వెళ్లారు. 'ఆటా సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్నానని చెప్పడంతో ఆమె వీసా రిజక్ట్ చేశారు.

    సాధారణ వ్యక్తులకు కూడా

    సాధారణ వ్యక్తులకు కూడా

    కేవలం సినీ తారలు మాత్రమే కాదు... అమెరికా తెలుగు సభలకు వెళుతున్న ఇతర వ్యక్తులను కూడా అమెరికా అధికారులు అనుమతించడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మేక మహేందర్ రెడ్డి పెట్టుకున్న వీసా కూడా ఇదే కారణంతో తిరస్కరణకు గురైంది.

    తెలుగు సంఘాల ముసుగులో

    తెలుగు సంఘాల ముసుగులో

    అమెరికాలో ఇంతకాలం జరిగిన సెక్స్ దందా తెలుగు సంఘాల ముసుగులో జరిగిందని, ఆయా సంఘాల తరుపున జరిగే కార్యక్రమాలకోసమని చెప్పి తెలుగు సినీ స్టార్లను అమెరికా తీసుకెళ్లేవారని యూఎస్ఏ పోలీసులు తేల్చారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు కిషన్ మోదుగుమూడి, చంద్రకళ దంపతులను అమెరికా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

    ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన

    ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన

    తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై అమెరికాలో జరిగే తెలుగు సంఘాల వేడుకల్లో సినీతారల తళుకుబెళుకులు ఉండబోవని స్పష్టమవుతోంది. అయితే కొందరు చేసిన తప్పుకు అందరినీ ఇలా అడ్డుకోవడం సరికాదని ఇండస్ట్రీ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    It is known that an NRI couple named Kishan Modugumudi and his wife Chandra Modugumudi have been accused of trapping Tollywood actors and forcing them into prostitution. After this insident US government had officially announced that there will be no US visa granted to actresses from Tollywood. Actress Surekha Vani recently applied for B1B2 visa to attend ATA association event but US consulate rejected her visa after mention about ATA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X