US Elections Results: అమెరికా ఎన్నికల బ్యాలెట్‌లో బాలయ్య పేరు.. పరాయి గడ్డపై జై బాలయ్య నామస్మరణం!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ, డెమాక్రాటిక్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారీస్ విజయావకాశాలపై హోరాహోరీగా ప్రచారం చేశారు. అయితే తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న యూఎస్ ఎన్నికల బ్యాలెట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అమెరికా అధ్యక్ష ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. ఈ ఫలితాల వెల్లడిలో ట్రంప్ ముందంజలో ఉన్నాడు. 17 రాష్ట్రాల్లో ట్రప్ గెలిచి జోష్‌తో ముందుకెళ్తున్నాడు. అలబామా, ఆర్కాన్సాస్‌, ఫ్లోరిడా,ఇండియానా, కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ, వెస్ట్‌ వర్జీనియా, సౌత్‌ కరోలినా తదితర ప్రాంతాల్లో ట్రంప్ విజయం సాధించారు.

US Elections Results 2024 Nandamuri Balakrishna name seen on American Election ballot

తాజా సమాచారం ప్రకారం.. 9కిపైగా స్థానాల్లో కమల హారీస్ విజయం సాధించినట్టు తెలిసింది. కనెక్టికట్‌, డెలవేర్‌, ఇల్లినోయీ, మసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌, న్యూజెర్సీ, రోడ్‌ ఐల్యాండ్‌, వెర్మాంట్‌, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో గెలుపు సాధించారు. ఇలా ఎన్నికల ఫలితాలు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో అందర్నీ ఓ బ్యాలెట్ పేపర్ ఆకర్షిస్తున్నది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో నందమూరి బాలకృష్ణ పేరు కనిపించడంతో అవాక్యయ్యారు. బ్యాలెట్ పేపరులో స్వదస్తూరి ఆప్షన్ వద్ద బాలయ్య అంటూ ఓ ఓటరు తన అభిమానాన్ని చాటుకొన్నారు. అయితే అమెరికా ఎన్నికల అధికారులకు నిజంగా ఇది కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

US Elections Results 2024 Nandamuri Balakrishna name seen on American Election ballot

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోను, దేశంలోని ప్రధాన నగరాల్లో జై బాలయ్య నినాదం మార్మోగుతున్నది. పబ్‌లు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో బాలయ్య నామస్మరణ భారీగానే జరుగుతున్నది. జై బాలయ్య నినాదం ఎన్ని వర్గాల్లోను క్రేజీగా మారింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు ఓటరు బాలయ్య పేరు రాయడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

ఇదిలా ఉండగా, బాలయ్య కెరీర్ పరంగా, ప్రొఫేషనల్ పరంగా దూసుకుపోతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సంక్రాంతి బరిలో దూకేందుకు రెడీ అవుతున్నారు. అలాగే బోయపాటి కలిసి అఖండ 2 సినిమాను ఇటీవలే ప్రారంభించారు. అలాగే అన్‌స్టాపబుల్ సీజన్ 4తో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా, బవసతారకం వ్యవహారాలు ఇంకా పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X