»   » అమెరికాలో బాలయ్యకు రాయల్ వెల్ కం, భారీ ర్యాలీ (వీడియో)

అమెరికాలో బాలయ్యకు రాయల్ వెల్ కం, భారీ ర్యాలీ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం అమెరికా చేరుకున్నారు. అక్కడి సీటెల్ విమానాశ్రయంకు చేరుకున్న బాలయ్యకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

బాలయ్యకు అభిమానులు రాయల్ వెల్ కం చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి బాలయ్య బస చేయనున్న హోటల్ వరకు పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు అమెరికాలో అభిమానులు ఈ రేంజిలో స్వాగతం పలకలేదని...అంటున్నారు.

బాలయ్య అమెరికా వెళ్లడానికి ఓ ముఖ్య కారణం ఉంది. బాలయ్య చైర్మన్ గా నడుస్తున్న బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిని మరింత ఆధునికీకరించేందుకు నిధుల సేకరణ నిమిత్తం బాలయ్య అమెరికా వెళ్లారు.

తన తల్లి బసవతారకం పేరు మీద స్థాపించిన ఈ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఏడాది బాలయ్య ఆసుపత్రి నిర్వహణ కోసం నిధుల సేకరణ చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ సారి కూడా ఆయన అమెరికా వెళ్లారు. ఈ సారి బాలయ్య పుట్టినరోజు వేడుకలు అమెరికాలోనే జరుగబోతున్నాయి. ఈ నె 10న కాలిఫోర్నియాలో అభిమానుల సమక్షంలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి.

English summary
One of the biggest rally in seattle history ‪‎US‬ Hattsoff to US NBK Fans. Adu Evadu Idu Evadu ‪‎Balayya‬ ki Edhuru Evadu Never Before Never Again Jai Balayya ! Ayana Range Ayana Sthayi Veru.‬
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu