సెక్స్ రాకెట్: కిషన్ అకౌంట్‌లో భారీగా డబ్బు.. ఆ 30 మంది ఎవరు, నిగ్గుతేల్చే పనిలో యూఎస్ పోలీసులు!
Recommended Video

చికాగో సెక్స్ రాకెట్.. తెలుగు చిత్ర పరిశ్రమని విమర్శలగు గురిచేసిన మరో ఉందంతం ఇది. హీరోయిన్లని ట్రాప్ లోకి దించి వారి చేత వ్యభిచారం చేయించిన కేసులో కిషన్, చంద్రకళ దంపతులని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్వారా ఈ వ్యవహారంలో మొత్తం కూపీ లాగే ప్రయత్నం అమెరికా పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే పలు సంచలన విషయాలని అమెరికా పోలీసులు వెలుగులోకి తీశారు. తాజగా కిషన్ బ్యాంక్ అకౌంట్ ని పరిశీలించిన యుఎస్ అధికారులకు కళ్ళు చెదిరే వాస్తవాలు ఎదురయ్యాయి.

అకౌంట్ లో భారీగా డబ్బు
కిషన్, చంద్ర ఇద్దరి బ్యాంకు ఖాతాలని పోలీసులు పరిశీలించారు. భారీ మొత్తంలో వారి ఖాతాల్లో డబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కిషన్, చంద్ర దంపతుల లావేదేవిలని పరిశీలించగా పోలీసులకు కళ్ళు చెదిరే వాస్తవాలు ఎదురయ్యాయి.

ఆ 30 మంది ఎవరు
ఇటీవల కాలంలో 30 మంది తెలుగు ప్రముఖులు కిషన్ బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమచేసినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తంలో వారు ఎందుకు డబ్బు వేశారు. వారితో ఉన్నా సంబంధం ఏమిటి అని పోలీసులు కిషన్ దంపతులని ఇంటరాగేట్ చేస్తున్నారు.

సెక్స్ రాకెట్ తో సంబంధం
30 మంది వివరాలని సేకరించే పనిలో అమెరికా అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. వీరికి సెక్స్ రాకెట్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

వారి పని అదే
కిషన్, చంద్రకళ దంపతులు అమెరికా కేంద్రంగా సాగించిన ఈ వ్యభిచార దందా గురించి తెలుసుకున్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డ వీరు డబ్బు సంపాదించడానికి ఈ నీచమైన వృత్తిని ఎంచుకున్నారు. హీరోయిన్లకు డాలర్స్ వలవేసి వారితో వ్యభిచారం చేయించారు. గుట్టు రట్టు కావడంతో కటకటాల పాలయ్యారు.


Click it and Unblock the Notifications











