రామ్ చరణ్ తో నటించాలని ఉందా?
రామ్ చరణ్ తేజ, జెనీలియా కాంబినేషన్లో ప్రారంభంకానున్న చిత్రంలో నటించటానికి ఆసక్తి ఉన్న యువతీ, యువకులను ఆహ్వానిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగేంద్రబాబు తమ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ కాస్టింగ్ కాల్ కేవలం అమెరికాలో ఉండేవారికి మాత్రమే.
ఇక వారి రిక్వైర్ మెంట్స్
చూడటానికి బాగా ఉండి 18, 22 వయస్సుల మద్య ఉన్న అమ్మాయిలు ఇరవై మంది కావాలి.
అలాగే అదే వయస్సులో ఉన్న పదిహేను మంది మగపిల్లలు కావాలి.
వీటితో పాటు 35 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్న మగవాళ్ళు ఐదుగురు కావాలి.
అంతేవయస్సుతో ఉన్న ఆడవాళ్ళు కూడా ఐదుగురు కావాలి.
చిన్న పిల్లలు 5 నుంచి 12 సంవత్సరాల లోపు వారు ఐదుగురు కావాలి.
ఫైటర్స్ (మంచి లుక్ ఉన్న బాడీతో)పది మంది కావాలి.
ఇక మరొక్క సారి ఈ కాస్టింగ్ కాల్ కేవలం అమెరికాలో ఉన్నవారికి మాత్రమే నని గుర్తు పెట్టుకోండి
ఇక ఆసక్తి ఉన్నవారు తమ ఫ్రొఫైల్స్ ని ఫుల్ సైజ్, మిడ్ సైజ్, క్లోజ్ ఫొటోలతో పంపండి. మంచి అవకాశం...మిస్సవకండి...
మీరు మెయిల్ చేయాల్సిన ఎడ్రస్....[email protected] బెస్టాఫ్ లక్


Click it and Unblock the Notifications











