యూస్ఏ ట్రిప్: చార్టెడ్ ఫ్లైట్‌లో ‘డిజె’ టీం, ఖర్చెంతో తెలుసా?
డిజె టీం అమెరికా పర్యటనకు బయల్దేరింది. జూన్ 30, జులై 2న ఇక్కడ టీం పర్యటించబోతోంది.
హైదరాబాద్: 'డిజె-దువ్వాడ జగన్నాథమ్' మూవీ సూపర్ హిట్టవ్వడం, యూఎస్ఏలో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ ఎన్నారైలను కలవడానికి యూఎస్ఏ ట్రిప్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 30, జులై 2న అక్కడ రెండు చోట్ల ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్లలో డిజె టీం పాల్గొనబోతోంది.
ఓవర్సీస్‌లో డిజె చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన బ్లూస్కై సినిమాస్ వారు 'డిజె' టీం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....యూఎస్ఏలో టీం ఒక చోటు నుండి మరో చోటు తక్కువ సమయంలో చేరుకునేందుకు ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 25000 అమెరికన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్, పూజా హెడ్గే, సుబ్బరాజు, హరీష్ శంకర్, దిల్ రాజు ఈ పర్యటనలో పాల్గొంటారు. యూఎస్ఏలోని అభిమానులు డిజె టీంను కలిసి విష్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. యూఎస్ఏలో 'డిజె' చిత్రాన్ని రిలీజ్ చేసిన బ్లూస్కై సినిమా వారు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మొదట జూన్ 30 న్యూజెర్సీలో, తర్వాత జులై 2న సాన్ జోస్ లో ఈ వెంట్ జరుగనుంది.

New Jersey, USA
Date: June 30th, Friday @ 7 PM
Venue: Royal Albert Palace, 1050 King Georges Post Rd, Edison, NJ 08837
San Jose, CA, USA
Date: July 2nd, Sunday @ 7 PM
Venue: India Community Center, 525 Los Coches St, Milpitas, CA 95035
ఈ ఈవెంటులో పాల్గొనాలనుకునే అభిమానులు సులేఖ వెబ్ సైట్ ద్వారా తమ సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 60 డాలర్లు చార్జ్ చేస్తున్నారు. పది మంది కలిసి గ్రూఫ్ కూడా టేబుల్ రిజర్వ్ చేసుకోవచ్చు. దీనికి గాను 550 డాలర్లు చార్జ్ చేస్తున్నారు. ఈ ఈవెంటులో డిజె టీంతో కలిసి ఫోటోస్ దిగడం, డిన్నర్ చేయడం లాంటివి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇతర సమాచారం కోసం 732 586 0932 లేదా 510 755 6880 నెంబర్లను సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications











