నిలకడలేని ‘ఊసరవెల్లి’ రామ్!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ నెక్స్ట్ మూవీ టైటిల్ 'ఊసరవెల్లి" గా ఖరారు చేశారు. ఇదే విషయాన్ని రామ్ ధృవీకరిస్తూ సురేందర్ రెడ్డి తో నేను చేయబోయే సినిమా పేరుని 'ఊసరవెల్లి" గా ఖరారు చేయడం జరిగింది. ఆ సినిమా స్టోరీని మొదటి భాగం నాకు దాదాపు మొత్తం పూసగుచ్చినట్టు వివరించాడు సురేందర్ రెడ్డి.
ఈ చిత్రంలో నా పాత్ర తీరు తెన్నులు అన్నిటినీ క్లుప్తంగా వివరించాడు. నాకు చాలా బాగా నచ్చింది. మొదట టైటిల్ వినగానే కొంచెం అసంతృప్తిగా అనిపించినప్పటికీ, మొత్తం స్క్రిప్ట్ చదివాక, నా పాత్రకు తగ్గట్టుగా ఈ టైటిల్ ఉందని నాకు అనించింది. అతను చెప్పినట్టే సినిమా కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంతైనా ఇది జీర్ణించుకోడానికి నాకు కొంత సమయం పడుతుంది.
ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీకెవరికీ ఈ సినిమా మూల కథ తెలియదు కాబట్టి, మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు టైటిల్ విన్న తరువాత. కానీ ఎంతైనా ఇది రెగ్యులర్ గా పెట్టే టైటిల్ కాదు" అని రామ్ తన బ్లాగ్‌లో రాసుకున్నాడు. పేరు వినగానే హీరో క్యారెక్టర్ గురించి ఒక అవగాహన రావడం సహజం. ఊసరవెల్లి అంటే నిలకడ లేనిదని అర్ధం వస్తుంది. మరి తెర మీద ఇది ఎంత వరకు పండుతుందో వేచి చూడాలి.
ప్రస్తుతం రామ్ హీరోగా, ప్రియా ఆనంద్, బిందు మాధవిలు హీరోయిన్స్ గా నటించిన 'రామ రామ కృష్ణ కృష్ణ" మే నెల 7న విడుదల కు సిద్దం కాబోతోంది.


Click it and Unblock the Notifications











