»   » సినీ నిర్మాత అట్లూరి రామారావు మృతి

సినీ నిర్మాత అట్లూరి రామారావు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అట్లూరి రామారావు(90) కన్నుమూశారు. పంజాగుట్ట హిందీనగర్‌లోని రుషిసారధి అపార్ట్‌మెంట్‌లో ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రామారావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రామోజీగ్రూప్‌కి చెందిన ఉషాకిరణ్‌ మూవీస్‌లో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన అట్లూరి రామారావు ఆ సంస్థ నుంచి వెలువడిన ఆణిముత్యాల్లాంటి పలు చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు వహించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అట్లూరి రామారావు అంత్యక్రియలు రేపు ఉదయం ఎర్రగడ్డ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, 'ఈనాడు' ఎండీ కిరణ్‌ అట్లూరి రామారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Usha Kiran movies Executive Producer Atluri Rama Rao died today.

సినీ ప్రముఖుల నివాళి
సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అట్లూరి రామారావుకు నివాళులర్పించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు అట్లూరి నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి పూలమాలను వేసి అంజలి ఘటించారు. అట్లూరి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. వన్ ఇండియా తెలుగు ఆయన ఆత్మ శాంతి కలగాలని అంజలి ఘటిస్తోంది.

English summary
Usha Kiran movies Executive Producer Atluri Rama Rao died today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu