ఉషాకిరణ్ మూవీస్ 'నిన్ను కలిసాక'
చిన్న చిత్రాలను నిర్మించి విజయవంతం చెయ్యడం "ఉషాకిరణ్ మూవీస్" వారికి తెలిసినట్టు ఇంకొరికి తెలియదనిపిస్తుంది. 'చిత్రం', 'నువ్వేకావీలి', 'ఆనందం', 'నచ్చావులే' లాంటి లో-బడ్జెట్ సినిమాలు విజయవంతం అవ్వడమే కాకుండా ట్రెండ్ సెట్టర్ మూవీస్ గా నిలిచాయి. ఇదే కోవలో వస్తున్న చిత్రం 'నిన్ను కలిసాక'. "ఉషాకిరణ్ మూవీస్" ప్రొడక్షన్ నెం.83 గా వస్తున్న ఈ చిత్రానికి శివనాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియో ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదలయింది. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు ఆడియోను ఆవిష్కరించి తొలి క్యాసెట్ ను దర్శకులు శివనాగేశ్వర రావుకు అందించారు. ఈ చిత్రం ద్వారా సంతోష్, చైతన్య, ప్రియ, దీపాషా నాయికానాయకులుగా పరిచయమౌతున్నారు. నూతన సంగీత దర్శకుడు సునీల్ కాశ్యవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అనంతరం, ఈ చిత్రంలోని ఒక్కొక్క గీతాన్ని కీరవాణి-చంద్రబోస్, రాజమౌళి-రమారాజమౌళి, తరుణ్-వి.ఎన్.ఆదిత్య, వైవియస్ చౌదరి-విష్ణువర్ధన్, క్రిష్-మనోజ్, జగపతిబాబు-మదన్‌లు ఆవిష్కరించారు.


Click it and Unblock the Notifications











