ఈ వారం ఆ ఒక్కటే రిలీజ్
ఈ వారం ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టీనేజ్ ఎంటర్ టైనర్ 'నిన్ను కలిశాక'ఒక్కటే రిలీజ్ అవుతోంది. సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు డైర్ట్ చేసిన ఈ చిత్రం ద్వారా సంతోష్, చైతన్య, ప్రియ, డిపాషా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. అలాగే ఈ చిత్రంలో 'ప్రేమ్ బాబా' అనే స్పెషల్ రోల్ ను శివనాగేశ్వరరావు పోషించడం విశేషం. ఉషాకిరణ్ బ్యానర్ పై రూపొందిన 83వ చిత్రమిది. 'నచ్చావులే' వంటి సక్సెస్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో బయిట మంచి అంచనాలున్నాయి. అలాగే ఈ శుక్రవారం కృష్ణవంశి,శ్రీకాంత్ కాంబినేషన్ లో రెడీ అయిన 'మహాత్మ' చిత్రం కూడా రిలీజ్ కావలసి ఉంది. అయితే ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లి ప్రస్తుతం రివైజింగ్ కమిటీ ముందు ఉంది. దీంతో విడుదల తేదీని ఈ నెల 9వ తేదీకి నిర్మాత వాయిదా వేశారు. దీంతో ఈ శుక్రవారం ఉషాకిరణ్ మూవీస్ 'నిన్ను కలిశాక' ఒక్కటే రంగంలో ఉంది.


Click it and Unblock the Notifications











