జంతువులతో అల్లు అర్జున్ ‘జులాయి’
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో 'జులాయి'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోవా సుందరి ఇలియాన హీరోయిన్. తాజా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చంది. ఈ చిత్రంలో కుక్కలతో పాటు, ఇతర జంతువులపై సీన్లు చిత్రీకరిస్తున్నారట. ఈ మేరకు దర్శక నిర్మాతలు 'యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా' పర్మిషన్ కోసం దరఖాస్తు చేస్తుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో ఏ జంతువును ఉపయోగించినా దానికి ముందుగా అనుమతి తప్పనిసరి అనే నిబంధన ఉంది.
ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య మాంచి రొమాంటిక్ సన్నావేశాలు ప్లాన్ చేశారు దర్శకుడు. అందులో అర్జున్, ఇలియానా మధ్య గాఢ చుంబన దృశ్యం కూడా ఉందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. పెళ్లి తర్వాత అర్జున్ పాల్గొన్న తొలి ముద్దు సన్నివేశం ఇదే. సోసూసూద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న పాటలు త్వరలోనే శ్రోతల ముందుకు రానున్నాయి. బన్నీ ఇది వరకు నటించిన 'బద్రీనాథ్' చిత్రం ఊహించిన ఫలితాలను ఇవ్వక పోవడంతో కాస్త వెనకబడ్డ బన్నీ మళ్లీ మాస్ ఆడియన్స్ ను, యూత్‌ను తన వైపు తిప్పుకోవడానికి జులాయి అవతారమెత్తాడు.
బాలీవుడ్ కెమెరామెన్ అమోల్ రాఘోడ్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పని చేస్తుండటం ఈ చిత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత. డివివి దానయ్య సమర్పణలో హారిక హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











