సమస్య పరిష్కారం: ‘ఉత్తమ విలన్’ ఎట్టకేలకు రిలీజైంది
హైదరాబాద్: కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘ఉత్తమ విలన్' చిత్రం నిన్న(మే 1) విడుదల కావాల్సి ఉండగా.....ఫైనాన్షియర్లకు, నిర్మాతలకు మధ్య ఆర్థిక పరమైన విబేధాలు రావడంతో విడుదల ఆగి పోయిన సంగతి తెలిసిందే. షో పడక పోవడంతో నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న టికెట్స్ కు సంబంధించిన డబ్బు కూడా తిరిగి ఇచ్చేసారు.
తాజాగా సమస్య పరిష్కారం కావడంతో ‘ఉత్తమ విలన్' చిత్రాన్ని ఈ రోజు (మే 2) మధ్యాహ్నం నుండి పలు చోట్ల షోలు ప్రారంభం అయినట్లు సమాచారం. ఉత్తమ విలన్ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతీ మేనన్ హీరోయిన్లు.

ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎన్.లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్, కమల్‌హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











