మహేష్ బాబుని కలసిన ఉత్తరాఖండ్ సీఎం.. కాలేజీలో షూటింగ్ షురూ!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25 వ చిత్రం షురూ అయింది. డెహ్రాడూన్ లోని కళాశాల నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరణ ప్రారంభించారు. మహేష్ 25 మూవీ సెట్స్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మహేష్ బాబుని కలిశారు.
సూపర్ స్టార్ మహేష్ షూటింగ్ నిమిత్తం డెహ్రాడూన్ వచ్చాడని తెలుసుకున్న త్రివేంద్ర సింగ్ సెట్స్ కు వెళ్లి మహేష్ ని, చిత్ర యూనిట్ ని కలిశారు. మహేష్ తో త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబుగా గడ్డం లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆసక్తికరమైన ఈ చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











