»   » మోహన్ బాబు ‘రౌడీ’యిజంపై జేఏసీ ఆందోళన

మోహన్ బాబు ‘రౌడీ’యిజంపై జేఏసీ ఆందోళన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోహన్ బాబు ఫ్యామిలీ నుండి వస్తున్న చిత్రాలు తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఆ మధ్య మోహన్ బాబు ఫ్యామిలీ నుండి వచ్చిన దేనికైనా రెడీ, దూసుకెళ్తా చిత్రాలు వివిధ వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

తాజాగా 'రౌడీ' చిత్రం కూడా వివాదంలో ఇరుక్కుంది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో, నటుడు మోహన్ నటించిన 'రౌడీ' సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు మంగళవారం ఆందోళనకు దిగారు. రౌడీ సినిమాలోని సన్నివేశాలు ప్రజలను ప్రభావితం చేసేవిధంగా ఉన్నాయని వారు ఆరోపించారు.

Uttarandhra JAC demands stop Rowdy movie

ఈ చిత్రం ద్వారా సమాజంలో రౌడీయిజం పెరిగిపోతుందని వారు తెలిపారు. రాజకీయ పరంగా రౌడీయిజాన్ని చెలాయించే అంశాలు ఈ సినిమా ఎక్కువగా ఉన్నందున 'రౌడీ' సినిమా విడుదలను నిలిపివేయాలని ఉత్తరాంధ్ర జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు నేతలు తెలిపారు.

'రౌడీ' చిత్రంలో మోహన్‌బాబు, విష్ణు, జయసుధ, శాన్వి ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రౌడీ ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

English summary
Uttarandhra JAC demands stop srceening of Rowdy movie. Rowdy is a 2014 Telugu film written and directed by Ram Gopal Varma. It stars Mohan Babu and his elder son Vishnu Manchu with Jayasudha and Shanvi Srivastav in Important roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu