twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ గురించి ఉత్తేజ్ ఇలా...

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలు, దర్శక,నిర్మాతలు అందరూ పవన్ కళ్యాణ్ పై తమ దైన శైలిలో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఆయన పుట్టిన రోజుకి ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంబ హీరోలైతే తమ సినిమాల ఫస్ట్ లుక్ టీజర్స్ ని వదిలి తమ అభిమానాన్ని చాటు కున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తేజ్ సైతం పవన్ పై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. మీరు ఈ క్రింద ఫొటోలలో చూస్తున్న కవిత ఆయన రాసినదే.

    పవన్ కళ్యాణ్ ను అందరూ పవర్ స్టార్ గా పిలిస్తే తనకు మాత్రం ఓ విశ్వ మిత్రుడుగా కనిపిస్తాడంటూ రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని మొత్తం ఈ కవిత ద్వారా తెలియచేసాడు. మీరు చదవండి.

    Uttej composes poem on Pawan!

    సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఉత్తేజ్‌ 'కళ్ళు' చిత్రానికి అప్రెంటిస్‌ డైరక్టర్‌గా పనిచేసి 'రావుగారిల్లు'తో అసిస్టెంట్‌ అయ్యారు. అప్పుడు వర్మతో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసారు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించారు. మొదట ఎన్టీఆర్‌ అభిమాని. తరువాత చిరంజీవి అభిమానిగా మారారు. తనకున్న పరిచయాల పరిధిలో స్నేహితులకు సాయపడే తత్వం ఎక్కువ. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటిస్తున్నారు.

    English summary
    Writer cum actor Uttej described Pawan in the most authentic and honest way on the occasion of Pawan's birthday. Uttej described Pawan's revolutionary traits and humanity also pointed out how the Janasena leader reacted on present day politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X