Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ గురించి ఉత్తేజ్ ఇలా...
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలు, దర్శక,నిర్మాతలు అందరూ పవన్ కళ్యాణ్ పై తమ దైన శైలిలో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ఆయన పుట్టిన రోజుకి ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మెగా కుటుంబ హీరోలైతే తమ సినిమాల ఫస్ట్ లుక్ టీజర్స్ ని వదిలి తమ అభిమానాన్ని చాటు కున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తేజ్ సైతం పవన్ పై తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. మీరు ఈ క్రింద ఫొటోలలో చూస్తున్న కవిత ఆయన రాసినదే.
పవన్ కళ్యాణ్ ను అందరూ పవర్ స్టార్ గా పిలిస్తే తనకు మాత్రం ఓ విశ్వ మిత్రుడుగా కనిపిస్తాడంటూ రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని మొత్తం ఈ కవిత ద్వారా తెలియచేసాడు. మీరు చదవండి.
సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఉత్తేజ్ 'కళ్ళు' చిత్రానికి అప్రెంటిస్ డైరక్టర్‌గా పనిచేసి 'రావుగారిల్లు'తో అసిస్టెంట్ అయ్యారు. అప్పుడు వర్మతో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసారు. శివ, గాయం, మనీ, మాస్టర్ తదితర చిత్రాల్లో నటించారు. మొదట ఎన్టీఆర్ అభిమాని. తరువాత చిరంజీవి అభిమానిగా మారారు. తనకున్న పరిచయాల పరిధిలో స్నేహితులకు సాయపడే తత్వం ఎక్కువ. మైమ్, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటిస్తున్నారు.