twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్టర్ ఉత్తేజ్ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ

    By Bojja Kumar
    |

    Uttej daughter Chetana to become heroine
    హైదరాబాద్: తెలుగు నటుడు ఉత్తేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఉత్తేజ్ కేవలం నటుడు మాత్రమే కాదు...అసిస్టెంట్ డైరెక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, డైలాగ్ రైటర్‌గా కూడా పలు చిత్రాలకు పని చేసాడు. తాజాగా ఉత్తేజ్ వారసత్వం పునికి పుచ్చుకుని ఆయన కూతురు చేతన హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

    తేజ దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం' సినిమాలోనే బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన చేతన....త్వరలో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఆమె నటించబోయే సినిమాకు సంబంధించిన వివరాలు త్వలరోనే వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఫోటో షూట్లు, షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తోంది.

    టాలీవుడ్లో సాధారణంగా పలువురు సెలబ్రిటీల కుమారులే తప్ప కూతుర్లు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఉత్తేజ్ మాత్రం ఇందుకు భిన్నంగా హీరోయిన్ కావాలనుకున్న తన కూతురును చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. మరి మన తెలుగమ్మాయి హీరోయిన్‌గా సక్సెస్ కావాలని ఆకాంక్షిద్దాం.

    ఉత్తేజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఇతను నల్గొండ జిల్లా సీతారాంపురంలో జన్మించాడు. ఉత్తేజ్ ఒక పేద కళాకారుల కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి ఆకుపత్ని శ్రీరాములు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్యసమరయోధుడు, తల్లి సుద్దాల శకుంతల. ఉత్తేజ్ తాత, తండ్రి ఇద్దరు డ్రామాలు వేసేవారు, రచనలు కూడా చేసేవారు, ఆ ప్రభావమే నటుడు కావాలని ఉత్తేజ్ పై పడింది. కళలంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ఉత్తేజ్ ఆరేడేళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుని పాత్ర పోషించాడు.

    ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాదు వచ్చి నాంపల్లి ప్రభుత్వ జూనియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, సిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో రాంగోపాల్ వర్మ వద్ద శివ (1989) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అదే సినిమాలో క్యాంటీన్ బాయ్ గా నటించాడు. ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ తెలుగు సినీ రంగంలో ప్రసిద్ధ గీత రచయిత.

    సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఉత్తేజ్‌ 'కళ్ళు' చిత్రానికి అప్రెంటిస్‌ డైరక్టర్‌గా పనిచేసి 'రావుగారిల్లు'తో అసిస్టెంట్‌ అయ్యాడు. అప్పుడు రాంగోపాల్ వర్మతో ఏర్పడిన పరిచయం పెరుగుతూ శివ చిత్రం నుంచి రంగీలా వరకు వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు. శివ, గాయం, మనీ, మాస్టర్‌ తదితర చిత్రాల్లో నటించాడు. మైమ్‌, మేజిక్‌లలో ఆసక్తి గల ఉత్తేజ్‌ రేడియో, నాటికల్లో, టెలీ సీరియళ్ళలోనూ నటించాడు.

    English summary
    
 Uttej is a familiar artist to most of the Telugu film audience. He started his acting career from Siva. He entered to film industry as an assistant director. Uttej daughter is paving her way to foray into Tollywood as heroine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X