మహేష్ బాబు దెబ్బకు కూలబడ్డ నిర్మాణ సంస్ధ రీఎంట్రీ
తెలుగులో వరసగా సినిమాలు చేద్దామని ఆ మధ్య యు.టి.వి.మోషన్ పిక్చర్స్ తెగ ముచ్చట పడింది.అందుకు తగినట్లుగా వెంటనే రంగంలోకి దిగి మహేష్ తో సురేంద్రరెడ్డి దర్సకత్వంలో అతిధి అనే భారీ బడ్జెట్ చిత్రం చేసేసింది. అంతే కాకుండా మహేష్ తో మూడు సినిమాల ఒప్పందం కూడా చేసుకుంది.అయితే అతిధి చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆ సంస్ధ ఇంత ఖర్చు పెట్టి పాముకున్నది ఏముంది అనే వెనక్కి వెళ్ళి బుద్దిగా హిందిలో సినిమాలు కంటిన్యూ చేయసాగింది. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ సంస్ధకు తెలుగు మార్కెట్ పై కన్ను పడింది. అందుకనే ఇప్పుడు ఎటువంటి ఒప్పందాలు లేకుండా నేరుగా సినిమాలు తీసే పనిలో ఉంది. కొత్తగా యు.టి.వి.సౌత్ వ్యవహారాలు చూసేందుకు నియమితులైన ధనంజయన్ ఈ విషయాన్నీ ప్రకటించారు. మరో నెలలో పూర్తీ వివరాలతో అధికారిక ప్రకటన చేయనున్నారు.చూడాలి మన తెలగు నిర్మాతలు ఈ సారన్నా వారిని కంటిన్యూ చేయనిస్తారా లేక మళ్ళీ ఓ పెద్ద ప్లాప్ ఇచ్చి భయపెట్టి తరిమేస్తారో.


Click it and Unblock the Notifications











