ఐశ్వర్య రాయ్ 'హీరోయిన్' ని నిర్మాతలే ఆపారు
మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలో మొదలైన 'హీరోయిన్' చిత్రం ఈ సినిమా నిర్మాణాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్ ప్రకటించింది. ఐష్ గర్భవతి అని తెలిసినప్పటి నుంచీ ఈ చిత్రంలో ఆమె నటిస్తారా లేదా అనే విషయమ్మీద హిందీ చిత్ర వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ''ఐశ్వర్యతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోతున్నప్పటికీ - ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మరేదీలేదు. ఐశ్వర్య, అభిషేక్‌లు జీవితంలో ఒక కొత్త దశకు చేరుకుంటున్నారు. చిత్ర యూనిట్ మొత్తం వారికి శుభాభినందనలు తెలుపుతోంది'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications











