‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ టాక్ ఏంటి?
భారీ అంచనాలతో విడుదలైన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం తొలిరోజు మిక్స్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ స్టోరీలైన్ సినిమాను దెబ్బ తీసిందనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తం అవుతోంది. అసలు బాలయ్య ఇలాంటి సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నారో? అంటూ కొందరు విస్మయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మనోజ్ బ్యాడ్ లుక్‌తో కనిపించాడని, కామెడీ సన్నివేశాల్లో యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడని మూవీ చూసిన వాళ్లు అంటున్నారు. ఇక హీరోయిన్ దీక్షా సేథ్ విషయాని కొస్తే...అందంగా ఉందే తప్ప పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా మార్కులు వేయలేక పోతున్నారు ప్రేక్షకులు.
ప్రముఖ నటులు సుహాసిని, భాను చందర్, సాయి కుమార్, ప్రభు లాంటి వాళ్లు అవసరం లేకున్నా అతిథి పాత్రల్లో తీసుకున్నారని.... అయితే ధర్మవరపు, రఘుబాబు లాంటి వాళ్ల పాత్రలు కాస్త నవ్వులతో రిలీఫ్ ఇచ్చాయనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు సోనూ సూద్, అజయ్ పాత్రలను సరిగా వాడుకోలేక పోయారనే వాదన వినిపిస్తోంది.
మొత్తానికి సినిమా.... చంద్రముఖి తీయబోయి నాగవల్లి తీసారనే విమర్శను మూటగట్టుకుంది. ప్రేక్షకుల్లో భిన్న అభిప్రాయాలు ఉండటం సహజమే... మరి సినిమా ఎలా ఉంది అనే పూర్తి వివరాలతో కూడిన రివ్యూ... మా క్రిటిక్స్ మరికాసేపట్లో మీ ముందుకు తీసుకురాబోతున్నారు.


Click it and Unblock the Notifications











