హిట్టయితే హిందీలోకి బాలయ్య, మనోజ్ సినిమా

By Bojja Kumar

మంచు లక్ష్మి ప్రసన్న నిర్మాతగా 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, దీక్షసేథ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో బాలకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య ఇందులో పోషిస్తున్న 'నరసింహ రాయుడు' పాత్ర సినిమాకు హైలెట్ గా నిలవనుంది. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మూవీ విజయం సాధిస్తే హిందీలో రీమేడ్ చేయాలని నిర్మాత లక్ష్మి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' స్టోరీలైన్, స్ర్రిప్టు పక్కాగా ఉండటం, బాలయ్య లాంటి బిగ్ స్టార్ మెయిన్ రోల్ లో కనిపిస్తుండటంతో విజయం పై నిర్మాత లక్ష్మి భారీ ఆశలు పెట్టుకుంది. డిపార్ట్ మెంట్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి అక్కడ కూడా నిర్మాతగా తన హవా కొనసాగించే యోచనలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అది ఈ సినిమాతోనే మొదలయ్యే అవకాశం ఉంది.

ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రానికి శేఖర్ రాజు దర్శకత్వం వహిస్తుండగా, బెబో శశి సంగీతం అందిస్తున్నారు. బి.రాజ శేఖర్ సినిమాటో గ్రాఫర్ గా పని చేస్తండగా, లక్ష్మి భూపల్ మాటల డైలాగ్స్ రాస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X