బాలయ్య ‘ఊకొడతారా...’ సెన్సార్ రిపోర్ట్

By Bojja Kumar

బాలకృష్ణ ప్రధాన పాత్రలో మంచు మనోజ్, దీక్షా సేథ్ జంటగా రూపొందుతున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'. ఈ రోజు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూడదగ్గ చిత్రం అని సన్సార్ సర్టిఫికెట్ అర్థం.

మూవీలో బాలకృష్ణ నటన చిత్రానికి హైలెట్‌గా నిలవనుంది. అదే విధంగా మంచు మనోజ్ రాకింగ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. గతంలో ఏ చిత్రంలోనూ చూడని విధంగా బాలకృష్ణ, మనోజ్ పాత్రలను చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో బాలయ్య నటన సరికొత్తగా ఉండటం, మనోజ్ భయంకరమైన గెటప్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

మంచు లక్ష్మీ ప్రసన్న భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని మంచు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. మంచు కుటుంబ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రం కోసం రూ. 6.5 కోట్లు ఖర్చు చేసి 'గాంధర్వ మహల్' సెట్ వేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన సంగీతం ఇప్పటికే విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. కథ, దర్శకత్వం శేఖర్ రాజా, బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. బెబో శశి సంగీతం అదించగా, బాలీవుడ్ సంగీత ద్వయం సలీమ్-సులేమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X