బాలయ్య ‘ఊకొడతారా..’ ప్రీమియర్‌షో డీటేల్స్

By Bojja Kumar

నందమూరి నట సింహం బాలకృష్ణ తాజా చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కి పడారా' చిత్రం రేపు(జూలై 27)విడులవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యూఎస్ఏ షెడ్యూల్‌ను అక్కడి బయ్యర్ల ప్రకటించారు. బాలయ్య స్టార్ ఇమేజ్‌ను, అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఈచిత్రం ప్రీమియర్ షోను జూలై 26న... 41 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

ఏతో పాటు యూకె, దుబయ్, కెనడా, సింగపూర్లలోనూ ఈచిత్రం ప్రదర్శితం కాబోతోంది. ఈ చిత్రం ప్రీమియర్ షోను ఈ రోజే అమెరికాలో భారీ ఎత్తున ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో జమిందార్ నరసింహ రాయుడుగా కనిపించనున్నారు. మనోజ్-దీక్షాసేథ్ ప్రేమికులుగా నటిస్తున్నారు. మనోజ్ డిఫరెంట్ గెటప్, యాక్షన్‌తో ఈ చిత్రంలో నటించాడు.

సినిమా మొత్తం రూ. 6 కోట్లూ పైచిలుకు ఖర్చుతో వేసిన 'గాంధర్వ మహల్' చుట్టు తిరుగుతుంది. గంధర్వమహల్‌కు అధిపతి నరసింహరాయుడు. గంధర్వ మహల్‌ను సొంతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో నరసింహ నాయుడుని చంపడానికి ప్రయత్నించి విఫలం అవుతారు. చివరకు ఓ సారి చంపేస్తారు. దీంతో బాలకృష్ణ పాత్ర ఆత్మ రూపంలో అందులోనే ఉంటుంది. తర్వాత ఆ మహల్ వారసత్వం కింద మంచు లక్ష్మికి దక్కుతుంది. ఆ మహల్‌ను సొంతం చేసుకోవడానికి సోనూసూద్ లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనోజ్ ఎంట్రీతో కథ ఆసక్తికరంగా మారుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన సంగీతం ఇప్పటికే విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. కథ, దర్శకత్వం శేఖర్ రాజా, బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. బెబో శశి సంగీతం అదించగా, బాలీవుడ్ సంగీత ద్వయం సలీమ్-సులేమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X