సైరాపై కన్నేసిన భారీ నిర్మాణ సంస్థ.. రాంచరణ్ సినిమా కూడా!
తక్కువ సమయంలోనే యూవీ క్రియేషన్స్ టాలీవుడ్ లో భారీ నిర్మాణ సంస్థగా ఎదిగింది. మిర్చి, రన్ రాజా రన్, భాగమతి, భలేభలే మగాడివోయ్ వంటి భారీ విజయాలు ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్సే నిర్మిస్తోంది.
ఈ సంస్థ తాజాగా రెండు భారీ చిత్రాలపై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్ర థియేట్రికల్ హక్కులని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో కలసి నైజాం ఏరియాలో ఈ సంస్థ రంగస్థలం చిత్రాన్ని విడుదుల చేసిన సంగతి తెలిసిందే.

Recommended Video

మరోవైపు కనివిని ఎరుగని అంచనాలతో మెగాస్టార్ సైరా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాపై కూడా యూవీ క్రియేషన్స్ వాళ్ళు కన్నేశారట. నైజాం, గుంటూరు, నెల్లూరు డిస్ట్రిబ్యూషన్ లో ఈ సంస్థలు మంచి పట్టు ఉంది. ఎలాగైనా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరి చిత్రాలు దక్కించుకుని డిస్ట్రిబ్యూట్ చేయాలనీ యూవీ క్రియేషన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











