»   » టైటిలేంటీ ఇలా ఉందీ... చూసి కూడా ప్రభాస్ ఒప్పుకున్నాడా?

టైటిలేంటీ ఇలా ఉందీ... చూసి కూడా ప్రభాస్ ఒప్పుకున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం బాహుబలి-2 సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆ వెంటనే సుజిత్ దర్శకత్వంలో ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ప్రభాస్ కోసం సుజీత్ దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తునే ఉన్నాడు. కథ, స్క్రీన్ ప్లే కూడా రెడీగా పెట్టుకున్నాడు.

ఇదిపోతే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపిస్తాడనే ప్రచారం కూడా సాగుతోంది. దీనికి సంబంధించి తాజాగా ఓ టైటిల్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ మూవీకి సిద్ధ అనే టైటిల్ పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. ఈ కథనాలు ఊరికే రాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు.... సిద్ధ అనే టైటిల్ ను తాజాగా ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. కాబట్టి ప్రభాస్ నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 UV Creations registers Radha Premakatha

అయితే ప్రభాస్ తో సినిమా కంటే ముందే మరో మూవీని తెరకెక్కించే ఆలోచనలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఉంది. ఆ సినిమా కోసమే సిద్ధ అనే టైటిల్ ఫిక్స్ చేశారేమో అనేది కూడా అనుమానమే. ఈ సినిమా తరువాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు సినిమాలు చేయనున్నాడు. ఒక సినిమా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి టైటిల్ ఎలా ఉండనుందో అనే ఆసక్తితో ప్రభాస్ అభిమానులు వున్నారు.

ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో తాజాగా 'రాధ ప్రేమకథ' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారు. ఇప్పుడు ఇదే ప్రభాస్ కోసం నిర్ణయించిన టైటిల్ అని టాక్. టైటిల్ ను బట్టి ఇది కథానాయిక నేపథ్యం కలిగిన కథ కోసం అనిపిస్తోంది. ఎటూ ప్రభాస్ రెండు సినిమాలకి యువీ క్రియేషన్స్ తో కమిటయ్యాడు. మొదటిది సిద్దా అనుకున్నా రెండోది "రాధ ప్రేమకథ" అనుకుంటున్నారు. బయట కూడా కొత్తదనం కోసం ప్రభాస్ సినిమాకే ఈ తరహా టైటిల్ పెట్టనున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

English summary
UV Creations planned few projects with Prabhas and Anushka after the completion of 'Baahubali: The Conclusion. the title 'Radha Premakatha' Now the doubt is that for the project to be acted by Prabhas or any other project?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu