థ్రిల్లింగ్: అనుష్క 'భాగమతి' టీజర్.. మరో 'జేజమ్మ' అవుతుందా?(వీడియో)
Recommended Video

అరుంధతిలో జేజమ్మ పాత్రను అంత తేలిగ్గా మరిచిపోలేం. అప్పటిదాకా గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చిన అనుష్కను.. అలాంటి పాత్రలో చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు.
జేజమ్మ పాత్ర తర్వాత తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు అనుష్క కేరాఫ్‌గా మారారు. ఇదే క్రమంలో రుద్రమదేవి సినిమాతోనూ మెప్పించారు. తాజాగా 'భాగమతి' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు.
'భాగమతి' టీజర్:
పిల్ల జమీందర్ ఫేం జీ అశోక్ దర్శకత్వంలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా 'భాగమతి' తెరకెక్కుతోంది. చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసింది.
టీజర్ చూస్తుంటే.. అరుంధతి తరహా బ్యాక్ డ్రాప్ గుర్తుకు వస్తోంది. ఓ పాడుబడ్డ బంగ్లాను హైలైట్ చేస్తూ టీజర్ కట్ చేశారు. బంగ్లాలోకి అనుష్క ప్రవేశించడం.. తన చేతికి తానే ఓ సుత్తితో మేకు కొట్టుకోవడం.. సస్పెన్స్ థ్రిల్లర్ తరహా సినిమాను తలపిస్తున్నాయి.

ఆకట్టుకున్న కెమెరా పనితనం:
భాగమతి టీజర్ లో సినిమాటోగ్రాఫర్ మది పనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

భాగమతి విశేషాలు:
జనవరి 26న విడుదల కానున్న భాగమతి చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. విద్యు రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ ఇతర పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోను ఈ సినిమా విడుదల చేయనున్నారు.

మరోసారి జేజమ్మను గుర్తుచేస్తుందా?
అరుంధతిలో జేజమ్మగా.. రుద్రమదేవిలో లీడ్ రోల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క 'భాగమతి'లో ఎలా ఆకట్టుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. భాగమతి సస్పెన్స్ థ్రిల్లర్ కథ తరహాలో కనిపిస్తుండటంతో.. మరోసారి జేజమ్మ తరహాలో ఆమె రెచ్చిపోయి నటిస్తారేమో అన్న అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











