‘ఉయ్యాలా జంపాలా’ హీరోయిన్ ఇంకోటి

అలాగే రచయిత నంధ్యాల రవి దర్శకత్వంలో రూపొందే లక్ష్మీ రావే మా ఇంటికి...చిత్రం ఆమె చేస్తోంది. జర్నలిస్ట్ అయిన గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమా లాంచ్ అయ్యి షూటింగ్ జరుగుతోంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇలా ఈ రెండు చిత్రాలు కొత్త దర్శకులతోనే కావటం విశేషం.
'ఉయ్యాలా జంపాలా'కు ముందే అవికాగోర్ తెలుగువారికి పరిచయం. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో ఆంధ్రప్రదేశ్ లో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తో ఈ చిత్రానికి ఓపినింగ్స్ సైతం రాబట్టుకుంది. నాగార్జున, హిట్ చిత్రాల నిర్మాత రామ్మోహన్ పి. నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొంది విడుదలైంది.
ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీ తో కలిపి రెండున్నర కోట్లు బడ్జెట్ అయిన ఈ చిత్రం 17 కోట్లు(గ్రాస్)కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ లో పెద్ద సినిమాతో పోటీ పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


Click it and Unblock the Notifications











