‘ఉయ్యాలా జంపాలా’ రిలీజ్ డేట్ ప్రకటించిన నాగ్

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. నాగార్జున, హిట్‌ చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా చెప్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమా ఆడియోని ఈ నెల 15న గ్రాండ్ గా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ధృవీకరించారు.

నిర్మాత నాగార్జున అక్కినేని మాట్లాడతూ..'మా' టి.వి.లో ప్రసారమవుతున్న చిన్నారి పెళ్ళికూతురు అంటే మీకు బాగా ఇష్టం. ఆ ఆనందియే మా 'ఉయ్యాల జంపాల'లో ఉమాదేవి. రాజ్‌ తరుణ్‌, ఆనందిలను హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇందుకు ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాం. మేమందరం కలిసి మీకు అందిస్తున్న ఒక స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగింటి ప్రేమకథ 'ఉయ్యాల జంపాల'. ఈ చిత్రం ఆడియోను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన రామ్మోహన్ మాట్లాడుతూ ' ఇంతకుముందు మా బేనర్‌లో 'అష్టాచెమ్మా', 'గోల్కొండ హైస్కూల్' చిత్రాలు నిర్మించాం. ప్రస్తుతం సురేశ్‌బాబు, నాగార్జునతో కలిసి తీస్తున్న విభిన్న కథాచిత్రం 'ఉయ్యాలజంపాల'. ఈ కథ నాగార్జునగారికి నచ్చడంతో సురేశ్‌బాబుతో కలిసి ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాం. రాజ్‌తరుణ్ అనే కొత్త నటుడు హీరోగా నటించిన ఈ సినిమాతో 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో ఎంతో పేరు తెచ్చుకున్న ఆనందిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ నెల్లోనే ఆడియోను విడుదల చేస్తాం' అని తెలిపారు.

ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కల: ఎస్.రవీందర్, సంగీతం: సన్నీ ఎం.ఆర్. నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి., దర్శకత్వం: విరించి వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X