నాగ్ ‘ఉయ్యాలా జంపాలా’ఆ సినిమాకు మరో వెర్షన్??

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. నాగార్జున, హిట్‌ చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా చెప్తున్నారు. ఈ చిత్రం ఉషా కిరణ్ మూవీస్ లో వచ్చిన నువ్వే కావాలి చిత్రం కి మరో వెర్షన్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

అయితే నువ్వే కావాలి చిత్రంలో ఇద్దరు చిననాటి స్నేహితులు...ఎవరికి వారే పెళ్లి కుదిరాక..ఒకరిపై మరొకరికి ప్రేమ ఉందని అర్దం చేసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రంలోనూ బావా మరదళ్ళకు...మొదట తమ మధ్య ప్రేమ ఉందని తెలియకపోయినా తర్వాత మరదలికి పెళ్లి కుదరటంతో ...ఒకరికిపై మరొకరికి ప్రేమ ఉందని అర్దం చేసుకుంటారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరు ఒకటి ఎలా అయ్యారు అనేది మిగతా కథ అంటున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'Uyyala Jampala' will release on Dec 25, Nagarjuna

సన్‌షైన్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున, రామ్మోహన్ పి. సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఉయ్యాల జంపాల' ఆడియో సీడీలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. విరించివర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్ తరుణ్, అవిక ('చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ ఆనంది) హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. డి. సురేశ్‌బాబు సమర్పిస్తున్నారు. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు.

దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ "కథ కల్పితమైనా, గ్రామంలో నేను చూసిన కొన్ని పాత్రలను ఇందులో చూపించాను. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ఊరిని చూడాలనుకుంటారు. పల్లెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో సహానుభూతి చెందుతారు'' అని చెప్పారు. ఈ సినిమాలో హీరో, తను ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటామనీ, ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయనీ, సన్నీ సంగీతం సమకూర్చిన పాటలన్నీ బాగా వచ్చాయనీ హీరోయిన్ అవిక తెలిపారు.

ఇది ముచ్చటైన చిత్రమనీ, వైవిధ్యమైన స్క్రిప్ట్‌తో రూపొందించారనీ అమల అన్నారు. కొన్ని చిత్రాలు మాత్రమే కళ్లలోంచి నీళ్లు తెప్పిస్తాయనీ, ఇది ఆ తరహా చిత్రమనీ నాగచైతన్య చెప్పారు. పాటలూ, ట్రైలర్లూ బాగున్నాయనీ, చక్కని కథతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాన్ని ఈ చిత్ర నిర్మాత రామ్మోహన్ వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కల: ఎస్.రవీందర్, సంగీతం: సన్నీ ఎం.ఆర్. నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి., దర్శకత్వం: విరించి వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X