»   »  ‘అర్జున్ రెడ్డి’.... పండగరోజు ఈ నీచమైన సినిమా వద్దంటూ ఆందోళన!

‘అర్జున్ రెడ్డి’.... పండగరోజు ఈ నీచమైన సినిమా వద్దంటూ ఆందోళన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు 'అర్జున్ రెడ్డి' సినిమా పేరెత్తితే చాలు మండిపడుతున్నారు. ఇటీవల ఈ సినిమా పోస్టర్లను చించేసి వార్తల్లోకి ఎక్కిన వీహెచ్.... తాజాగా సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

పవిత్రమైన వినాయక చవితి పండగ రోజు..... 'అర్జున్ రెడ్డి' లాంటి నీచమైన సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడం ఏమిటని ఆయన మండి పడ్డారు. ఈ సినిమా యువతను చెడగొట్టేలా ఉందని, ఇలాంటి సినిమాలకు సెన్సార్ అనుమతి ఎలా ఇచ్చింది అంటూ మండి పడ్డారు.

వీహెచ్ కోపానికి కారణం ఏమిటి?

వీహెచ్ కోపానికి కారణం ఏమిటి?

‘అర్జున్ రెడ్డి' సినిమాకు సంబంధించి ముద్దు పోస్టర్లు వి. హనుమంతరావుకు అస్సలు నచ్చలేదు. ఆర్టీసీ బస్సులపై ఇలాంటి పోస్టర్లు వేయడంతో ఆగ్రహానికి గురైన ఆయన వాటిని చించేసి వార్తల్లోకి ఎక్కారు.

Nani Praises Arjun Reddy @Theatrical Trailer Launch
హీరో కౌంటర్ ఇవ్వడంతో బాగా ఫీలయ్యారా?

హీరో కౌంటర్ ఇవ్వడంతో బాగా ఫీలయ్యారా?

హనుమంతరావు పోస్టర్లు చించిన ఘటనపై ‘అర్జున్ రెడ్డి' సినిమా హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్లో స్పందిస్తూ..... ‘తాతయ్యా చిల్' అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో వి.హనుమంతరావుకు బాగా కోపం వచ్చినట్లుంది.

వాటి వల్ల యాక్సిడెంట్స్

వాటి వల్ల యాక్సిడెంట్స్

హీరో, హీరోయిన్లు లిప్ లాక్ చేసిన పోస్టర్లను బస్సులకు అతికించారని... వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వి.హెచ్ మండిపడ్డారు. ఇలాంటి పోస్టర్లను వేయకూడదని ఆయన అన్నారు.

వర్మ ట్వీట్ మరింత మంటెక్కించింది

వర్మ ట్వీట్ మరింత మంటెక్కించింది

వి. హనుమంతరావు పోస్టర్లు చించిన ఘటనపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ...... హీరో విజయ్ వెంటనే వెళ్లి హనుమంతరావు బట్టలు చించాలని ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్‌తో వి.హెచ్. మరింత ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే సినిమాకు వ్యతిరేకంగా సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేసినట్లు స్పష్టం అవుతుంది.

వివాదాలు ప్లస్సవుతాయా? మైనస్సవుతాయా?

వివాదాలు ప్లస్సవుతాయా? మైనస్సవుతాయా?

గతంలో పలు సినిమాల విషయంలో ఇలానే పలు వివాదాలు చుట్టుముట్టాయి. కొన్ని సార్లు ఇలాంటి వివాదాల వల్ల సినిమాకు బాగా పబ్లిసిటీ జరిగి ప్లస్సయిన సందర్బాలున్నాయి.. కొన్ని సినిమాల విషయంలో వివాదాలు మైనస్ అయ్యాయి. మరి ‘అర్జున్ రెడ్డి' విషయంలో ఈ వివాదాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి.

English summary
Congress Senior Leader V Hanumantha Rao on Thursday staged a protest at the Censor Board office demanding the removal of objectionable scenes in the upcoming movie Arjun Reddy which is slated to release tomorrow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu