మహేష్ బాబు సినిమాలో విలన్ క్యారెక్టర్.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ బాబు!
ఘట్టమనేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సుధీర్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నాడు. గతంలో హీరోగా కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలతో అలరించిన సుధీర్ బాబు ప్రస్తుతం కమర్షియల్ సినిమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అవసరం అయితే విలన్ పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్రలో కూడా నాటిస్తాడా? అనే సందేహాలకు సుధీర్ బాబు ఒక క్లారిటీ ఇచ్చారు.

పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో..
సుధీర్ బాబు నెక్స్ట్ V సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ నటుడు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ యాక్షన్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోన్న విషయం తెలిసిందే. ఇక చిత్ర యూనిట్ ఏ మాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ కూడా చేస్తోంది.

భవిష్యత్తులో మహేష్ తో..
ఇక సుధీర్ బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో V సినిమా గురించి చెబుతూనే మహేష్ బాబుపై కొన్ని పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఇక భవిష్యత్తులో మహేష్ తో నటించే అవకాశం ఉందా? అలాగే విలన్ గా చేసే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్నలకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గతంలో బాలీవుడ్ లో వర్షం సినిమాకు రీమేక్ గా వచ్చిన భాగీ సినిమాలో సుధీర్ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబుని అడగడం ప్రాబ్లమ్ కాదు
సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ బాబు సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. ఆయనతో నటించాలని నాకు కూడా ఉంది. నిజంగా ఆయనతో ఒకట్రెండు సినిమాల్లో నటిస్తే బావుంటుంది. క్యారెక్టర్ బావుంటే తప్పకుండా చేస్తాను. ఈ విషయంలో మహేష్ ని అడగడం కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాదు.
Recommended Video

అలా అనుకుంటే ఎప్పుడో చేసేవాన్ని..
చేస్తే ఆడియెన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉండే పాత్ర చేయాలని ఉంది. కావాలని చేస్తే అది బావుండదు. అలా చేయాలని అనుకుంటే ఎప్పుడో మహేష్ బాబుతో నటించేవాడిని. ఇక ఆయన నాతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. ఫోన్ లో మాట్లాడుకుంటాం. లేకంటే నెలలో రెండు సార్లు మహేష్ ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటాం.. అని సుధీర్ బాబు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











