twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    V movie వివాదం: అక్రమంగా సినీ నటి ఫోటో వాడకం.. అమెజాన్‌ ప్రైమ్‌కు హైకోర్టు షాక్

    |

    ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. వీ సినిమాలో నటించిన సాక్షి మాలిక్ ఫోటోను నిబంధనలకు విరుద్ధంగా వాడటంపై తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చింది. ఈ వివాదంలో ఏం జరిగిందంటే..

    Recommended Video

    HC Asks Amazon To Take Down Nani's V Movie film | Sakshi Malik | Filmibeat Telugu
    లాక్‌డౌన్‌లో నేరుగా అమెజాన్‌లో

    లాక్‌డౌన్‌లో నేరుగా అమెజాన్‌లో


    లాక్‌డౌన్ కాలంలో నేచురల్ స్టార్ నాని నటించిన వీ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఆ చిత్రం సినీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. డివైడ్ టాక్‌తో సినిమా ఓటీటీలో ముందుకెళ్లింది. వీ చిత్రంలో నాని, సుధీర్ బాబు ఫెర్ఫార్మెన్స్ అభిమానులకు కాస్త ఊరటను ఇచ్చింది.

    సెక్స్ వర్కర్‌గా సాక్షి మాలిక్

    సెక్స్ వర్కర్‌గా సాక్షి మాలిక్

    వీ చిత్రంలో అదితిరావు‌తోపాటు సాక్షి మాలిక్ ఓ కీలక పాత్రలో కనిపించింది. కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా సాక్షి మాలిక్ నటించింది. అయితే వీ సినిమాను అమెజాన్‌లో లోడ్ చేసినప్పుడు సాక్షి ఫోటోను ఉపయోగించారు. అయితే ఆమె ఫోటోను అనుమతి లేకుండా వాడటం వివాదంగా మారింది.

    బాంబే హైకోర్టులో పిటిషన్

    బాంబే హైకోర్టులో పిటిషన్

    సాక్షి మాలిక్ ఫోటోను 2017లో ముంబైకి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆ తర్వాత సాక్షి తన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఆ ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తన ఫ్లాట్‌ఫామ్‌పై ఉపయోగించింది. అయితే తన ఫోటోను అనుమతి లేకుండా ఫోటోను వాడారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

    అమెజాన్‌కు బాంబే హైకోర్టు షాక్

    అమెజాన్‌కు బాంబే హైకోర్టు షాక్

    సాక్షి మాలిక్ తరఫున వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో ఉపయోగించుకోవడం వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లేలా చేయడమే అని అన్నారు. దాంతో 24 గంటల్లో సాక్షి మాలిక్ ఫోటోను తొలగించాలని అమెజాన్‌కు బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది.

    English summary
    V movie actress Sakshi Malik Photo contraversy: Amazon Prime Video illegal usage of Sakhi Malik. Sakhi filed a case in bombay high court. In this occassion, Bombay High Court Shocks Amazon Prime Video to remove of Photo in 24 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X