నాకు ఏ కథా నచ్చలేదు అందుకే ... : వి.వి వినాయిక్
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేశ్ పెద్ద కుమారుడు శ్రీనివాస్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ప్రారంభమయ్యి చాలా కాలం అయినా ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాలేదు. దాంతో ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వివి వినాయిక్ మీడియాతో మాట్లాడారు.
వివి వినాయిక్ మాట్లాడుతూ... నేను బెల్లంకొండ సురేష్ కుమారుడుని లాంచ్ చేయటానికి కమిటయ్యాను. ఎందుకంటే ఆయన నా మొదటి నిర్మాత. ఆది సినిమాతో నాకు కెరీర్ ఇచ్చిన వ్యత్తి. అందుకో ఆయన కుమారుడు చిత్రాన్ని నేను మంచి స్క్రిప్టుతో చేయాలనుకుంటున్నాను. అందుకోసం చాలా కథలు విన్నాను...కానీ నన్ను ఏదీ తృప్తి పరచలేదు. నాకు నచ్చింది బెల్లంకొండ కు నచ్చలేదు. అయితే ఫైనల్ గా ఓ లైన్ ని ఓకే చేసుకున్నాం. దాంతో ముందుకు వెళ్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది.
బెల్లంకొండ సురేశ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం.కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు.
ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. నాయక్ చిత్రం తర్వాత వినాయిక్ చేస్తున్న చిత్రం ఇదే. వినాయిక్ మొదటి చిత్రం ఆది కి నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యానర్ మీదే చేయటంతో ఆ అనుబంధం ఇలా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications












