వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ కొడుకు ఎంట్రీ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి తర్వలో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సినిమా రంగంలో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే రీతిలో ఉంటుంది కాబట్టి తన తనయుడు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా చూస్తున్నాడు బెల్లంకొండ. ఇందు కోసం స్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ను రంగంలోకి దించనున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు వినాయక్ ఇప్పటికే ఓకే చెప్పాడు కూడా. ఇందు కోసం బెల్లంకొండ నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సాయి నటన, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇండియాలోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణతో పాటు, బ్యాంకాక్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వివి వినాయక్ రామ్ చరణ్ తేజతో ఓ సినిమా రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత బెల్లకొండ కొడుకుతో చేసే సినిమాపై దృష్టి పెట్టనున్నాడు వినాయక్.
2010లో వచ్చిన అదుర్స్ సినిమా తర్వాత వివినాయక్ ఖాతాలో హిట్టనేది లేకుండా పోయింది. గత సంవత్సరం వచ్చిన బద్రీనాథ్ సినిమా పరాజయం పాలవ్వడంతో....ఈ సారి రామ్ చరణ్ తో చేసే సినిమాపై పూర్తి దృష్టి సారించాడు. రామ్ చరణ్ ఇందులో డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











