‘రభస’:‘ఆది’ని గుర్తు చేసేందుకే అలా...
హైదరాబాద్: ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం 'ఆది'. ఆ చిత్రం నిర్మాత బెల్లంకొండ సురేష్. ఆ బ్యానర్ లో మళ్లీ ఎన్టీఆర్ ఇన్నాళ్లూ చేయటం కుదరలేదు. ఇప్పుడు రభసతో అదే బ్యానర్ లో వస్తున్నారు. అయితే రభసకి దర్శకుడు వేరే. అందుకేనేమో తొల రోజులు గుర్తు చేసుకుంటూ ఆది ని గుర్తుచేద్దామని దర్శకుడు వివి వినాయిక్ ని సీన్ లోకి తెచ్చారు.
మరో ప్రక్క తన కెరీర్ లో తొలి చిత్రం ఆది కి హీరోగా చేసి, సూపర్ హిట్ అందించిన ఎన్టీఆర్ అంటే దర్శకుడు వివి వినాయిక్ కి ఎనలేని అభిమానం. అందుకే ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా 'రభస'కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ నెల 29న 'రభస' విడుదల అవుతుంది.
పాత్ర ఏదైనా పాదరసంలా దూసుకుపోయే హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్. తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'రభస'. సమంత, ప్రణీత కథానాయికలు. ఇందులో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. రెండు పాత్రలూ.. పంచే వినోదం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్నీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ఆంధ్రావాలాలో రెండు పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే తమన్ సంగీతం అందించిన 'రభస' ఆడియో ఎన్టీఆర్ పాడిన 'రాకాసి రాకాసి' పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీతో 'రభస'లో ఎన్టీఆర్ నుండి అభిమానులు ఆశించే అంశాలు అన్ని ఉంటాయని దర్శకుడు తెలిపారు.
దర్శకుడు చెబుతూ ''ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పండగలా ఉంటుంది. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. తమన్ చక్కటి పాటలిచ్చారు''అన్నారు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











