twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్కడ లేని నీరసం ఆవహించింది.. వి వి వినాయిక్

    By Srikanya
    |

    ఒళ్లు హూనమైపోయింది. తీరా చూస్తే ఆ ప్రదేశం షూటింగ్‌కి ఏ మాత్రం అనువుగా లేదు. ఎక్కడ లేని నీరసం ఆవహించింది. ఆ ప్రాంతంలో కరెంట్‌ లేదు. కనీసం తినడానికి కూడా ఏమీ లేదు అంటూ 'బద్రినాథ్‌'షూటింగ్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు దర్శకుడు వి వి వినాయిక్. ఈ నెల పదవ తేదీన విడుదల అవుతున్న 'బద్రినాథ్‌'చిత్రం ప్రమేషన్ లో భాగంగా కలిసిన మీడియాతో చర్చిస్తూ ఇలా స్పందించారు.ఇంతకీ వి వి వినాయిక్ ని అంతగా ఒళ్ళు హూనం చేసి నీరసం తెప్పించిన ప్లేసు ఏమిటంటే..కీ మోనస్ట్రీ అనే బౌద్ధారామం.దాని గురించి మాట్లాడుతూ..కీ మోనస్ట్రీ అనే బౌద్ధారామాన్ని ఓ రోజు నెట్‌లో చూశాం. అది సముద్ర మట్టానికి 14వేల అడుగుల ఎత్తున ఉంది.

    కులుమనాలికి దాదాపు 200 కి.మీ. దూరం. చాలా అద్భుతంగా కనిపించింది. ఎలాగైనా సరే అక్కడ కొన్ని సన్నివేశాలు తీయాలి అనిపించింది. అయితే లోయలు కాబట్టి ప్రయాణం చేయడం చాలా కష్టమైంది. కులు నుంచి దాదాపు 12 గంటలు పట్టింది. అక్కడికి వెళ్లేసరికి రాత్రి ఏడు గంటలైంది.చిన్న హోటల్‌ ఉంది. వెళ్లి ఏమైనా ఉందాని అడిగితే లేదన్నారు. ఎక్కడో చిన్న పండ్ల దుకాణం కనిపించింది. వెళ్లి చూస్తే అడుగుబొడుగు పళ్లున్నాయి. వాటినే తిని కడుపు నింపుకొన్నాం. దేవుడా ఈ రాత్రి గడిస్తే చాలు... అనిపించింది. ఇలాంటి అనుభవాలు షూటింగ్ సమయంలో చాలానే ఎదురయ్యాయి అన్నారు.

    English summary
    Badrinath film copyrights in Malayalam are owned by REDAKH ARTS and going to be released around 100 theatres all over kerala as said by Mr. Khader Hassan , producer REDAKH ARTS Produced AlluArjun’s previous movies Gangotri (Singam Kutti).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X