వారి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే అల్లు అర్జున్
తనను నమ్ముకొన్న వారి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే ఓ వీరుడిగా అల్లు అర్జున్ కనిపిస్తారు.బన్నీని కొత్త కోణంలో చూపించబోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు వి వి వినాయిక్.గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'బద్రినాథ్'వచ్చే నెల 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ విశేషాలును మీడియాకు తెలియచేయటానకి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినాయిక్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.అలాగే యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది.
మా సినిమాకీ 'బద్రినాథ్' పుణ్యక్షేత్రానికీ ఉన్న సంబంధం ఏమిటో తెర మీద చూసి తెలుసుకోవల్సిందే. పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన యాక్షన్ దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాం. కీరవాణి సంగీతం ప్రత్యేక ఆకర్షణ అన్నారు.ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, ఛాయాగ్రహణం: రవివర్మన్.


Click it and Unblock the Notifications











