అదే వి వి వినాయక్ సైడ్ బిజినెస్
ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ కు ఇప్పుడు మరో సైడ్ ప్రొపిషన్ ఉందంటున్నారు సినీ జనాలు.అది వాయిస్ ఓవర్ లు ఇవ్వడం.ఆ మధ్య శంభో శివ శంభో, కందిరీగ చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ దర్సకుడు తాజాగా మరో చిత్రానికి వాయిస్ ఇవ్వటంతో అంతా అలా కామెంట్ చేస్తున్నారు.అందులోనూ అది డబ్బింగ్ సినిమా కావటంతో వినాయిక్ పై ఇలా అంటున్నారు.ప్రస్తుతం ఆయన 'రేణిగుంట' అనే అనువాద చిత్రానికి ఆయన వాయిస్ ఓవర్ చెప్పారు. ఇటీవలే అందుకు సంబంధించిన డబ్బింగ్ చెప్పారు.ఈ విషయమై వినాయక్ మాట్లాడుతూ ''రేణిగుంట చిత్రాన్ని దర్శకుడు పన్నీర్ సెల్వమ్ తెరకెక్కించిన విధానం బాగుంది. కథ, కథనాలు నా మనసుని హత్తుకొన్నాయి.నిర్మాత సురేష్ కొండేటి కథను పరిచయం చేస్తూ సంభాషణలు చెప్పమనగానే అంగీకరించాను''అన్నారు.ఇక బద్రీనాధ్ చిత్రం ఫెయిలయ్యాక వినాయిక్ తాజాగా రామ్ చరణ్ కోసం కథను రెడీ చేస్తున్నారు.ఆకుల శివ అందించిన కథతో ఆయన మరో మారు రంగంలోకి దిగనున్నారు.


Click it and Unblock the Notifications











