twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి': ఇది దేవుడు రాసిన కథ

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజమౌళి సినిమాలకు కథ అందించే విజయేంద్ర ప్రసాద్‌ 'బాహుబలి'కీ కలం పట్టారు. 'బాహుబలి' కథకు సంబంధించి ఆయన దగ్గరేమైనా సమాచారం ఉంటుందేమో, 'బాహుబలి' గురించి ఆసక్తికరమైన అంశాలేమైనా చెబుతారేమో అని ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ ప్రయత్నించి చూసింది. కానీ ఆయనేమో 'ఇది దేవుడు రాసిన కథ' అనేశారు. విజయేంద్రప్రసాద్‌ చెప్పిన 'బాహుబలి' కథ ఇది. మీరూ వీడియోలో చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ''బాహుబలి' కథ నేనే రాశా అని అందరూ అనుకొంటున్నారు. కానీ ఇది దేవుడు రాసిన కథ. ఓసారి దేవుడికి సృష్టి చేయాలనిపించింది. కళ్లు తెరచి చూస్తే అంతా చీకటే కనిపిస్తోంది. ఆ చీకట్లో ఓ బాలుడు కాంతిని బంతిలా చేసుకొని ఆడేస్తున్నాడు. ఆ కుర్రాడికి 'సెంథిల్‌' అనే పేరు పెట్టాడు దేవుడు.

    V. Vijayendra Prasad Speech @ Baahubali Audio Launch

    'భవిష్యత్తులో బాహుబలి అనే సినిమా రాబోతోంది. దానికి కెమెరామెన్‌గా పనిచేయ్‌..' అంటూ ఓ వరమిచ్చి భూమ్మీదకు పంపాడు. ఆ తరవాత దేవుడు వంద ఏనుగులు, వంద గుర్రాలు, వంద పులులు తయారు చేశాడు. కానీ కాసేపు ఆగి చూస్తే.. నాలుగు సింహాలు, నాలుగు గుర్రాలు, నాలుగు ఏనుగులు, నాలుగు పులులు ఎక్కువగా కనిపించాయి. అదేంటి? నేను తయారు చేసినదానికంటే ఎక్కువగా ఉన్నాయ్‌? అనుకొన్నాడు. అక్కడో కుర్రాడు సృష్టికి మించిన సృష్టి చేసి అబ్బుర పరుస్తున్నాడు. ఆ అబ్బాయికి సాబుసిరిల్‌ అనే పేరు పెట్టి 'బాహుబలి'కి కళాదర్శకుడిగా పనిచేయ్‌'అని ఆజ్ఞాపించి భూమ్మీదకు పంపాడు.

    ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్న ఓ బాబుకి శ్రీనివాసమోహన్‌ అని నామకరణం చేసి... విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడిగా మార్చాడు. ఈలోగా వెనుక నుంచి 'హూ..హా..' అనే అరుపులు వినిపించాయి. చూస్తే ఓ చిన్న కుర్రాడు. బాణాలేస్తున్నాడు. యుద్ధవీరుడిలా కనిపించాడు. దేవుడు ముచ్చటపడి 'ఏదైనా ఓ వరం కోరుకో' అన్నాడు. 'స్వామి నేను యుద్ధం చేయాలి..' అన్నాడు. '

    V. Vijayendra Prasad Speech @ Baahubali Audio Launch

    సరే భవిష్యత్తులో చేద్దువుగానీ.. అయితే నువ్వు చేసిన యుద్ధం వల్ల ఎవ్వరికీ ఏ హానీ కలక్కూడదు. అందుకే 'బాహుబలి' అనే సినిమాకి ఫైట్‌ మాస్టర్‌గా పనిచేయ్‌' అంటూ వరం ఇచ్చేశాడు. ఈలోగా ఓ అందాల బొమ్మ కనిపిచింది. దేవుడికి పళ్లూ, పూలూ నైవేద్యం పెట్టి కాకాపట్టింది. వాత్సల్యంతో 'వరం కోరుకో..' అని అడిగితే.. 'రాజమౌళికి భార్య కావాలి' అని కోరుకొంది. తనే... రమా రాజమౌళిలా భూమ్మీదకు వచ్చింది.

    ఆ తరవాత అర్జునుడికున్న ధైర్యం, భీముడికి ఉన్న బలం, రాముడి గుణం, కృష్ణుడి సమ్మోహనం కలగలిపి 'ప్రభాస్‌'ని పుట్టించాడు దేవుడు. ఇవన్నీ అయ్యాక నన్ను పిలిచి 'కాళకేయ' భాషలో 'బాహుబలి' కథ చెప్పాడు. ఆ భాష నాకు అర్థమయ్యేసరికి ఇంతకాలం పట్టింది. అలా 'బాహుబలి' వస్తోంది''అంటూ ఓ కథని అప్పటికప్పుడు అల్లి ప్రేక్షకుల్ని మెప్పించారు.

    English summary
    Baahubali audio released yesterday at Tirupathi. The movie is produced under Arka Productions and has also partnered with Karan Johar's Dharma Productions for its release in Hindi language. It will originally be released in Telugu and Tamil, while its dubbed versions will be released in Hindi, English and French. Baahubali is all set to hit the silver screens across the world on July 10.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X