twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రచ్చ'లో రీమిక్స్ చేస్తున్న పాట అది

    By Srikanya
    |

    రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో చిరంజీవి ఆల్ టైమ్ హిట్ వానా వానా వెల్లువాయే పాటను రీమిక్స్ చేస్తున్నారు.మొదట గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేసి వాడుతున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఈ పాటను ఈ రోజు(ఆదివారం)ఉదయం నుంచి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు.అప్పట్లో చిరంజీవి,విజయశాంతి వర్షంలో చేసిన డాన్స్ లను మరిపించే విధంగా ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.గతంలోనూ మగధీర చిత్రంలో బంగారు కోడి పెట్ట పాటను రీమిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ పాటకు,శోభి కొరియోగ్రపిని సమకూరుస్తున్నారు.

    ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

    English summary
    Ram Charan’s remixing another super hit duet from his father’s hit movie - Gangleader. That popular duet, Vaana Vaana Velluvaye is now filmed on Ram Charan and Tamannah. from Sunday morning
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X