వాణి: లుక్ సెక్సీగా...మాటలు హాట్‌గా (ఫోటోలు)
హైదరాబాద్: నాని హీరోగా తెరకెక్కిన 'ఆహా కళ్యాణం' చిత్రం ద్వారా దక్షిణాది సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్న భామ వాణి కపూర్. తొలి సినిమాతోనే అమ్మడు చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య తరచూ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో పాటు, ఇంటర్వ్యూల్లో బికినీ సీన్లు, లిప్ లాక్ సీన్ల గురించి ఎలాంటి మొహమాటం లేకుండా హాట్ హాట్ మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇటీవల నాని, వాణిలపై పలు గాసిప్స్ ప్రచారంలో రావడంతో ఓ విలేకరి వాని కపూర్‌ను ప్రశ్నింగా....నానితో నాకు ఎఫైర్ ఉన్న మాట వాస్తవమే, అయినా ఈ రోజుల్లో ఎఫైర్ అనేది కామన్. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ సెన్సేషన్ కామెంట్ చేసింది. దీంతో పాటు ఎంత గ్లామర్‌గా అయినా నటించేందుకు రెడీ అంటోంది.
సీన్ డిమాండ్ చేస్తే ఎవరితో అయినా లిప్ లాక్ సీన్లు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈత కొలనులో సీన్లు చిత్రీకరించేప్పుడు బికినీ వేయక తప్పదు అంటూ బోల్డ్‌గా మాట్లాడుతోంది వాణి. సినిమా ప్రమోషన్లలో హీరో నాని కంటే వాణినే ఫాస్ట్‌గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ప్రెస్ మీట్లో వాణి కపూర్ బ్లాకర్ సారా, సెక్సీగా డిజైన్ చేయబడ్డ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

ఆహా కళ్యాణం చిత్రం ద్వారా సౌత్‌లోకి..
ఆహా కళ్యాణం చిత్రం ద్వారా వాణి కపూర్ సౌత్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకే సారి విడుదల అవుతోంది. గోకుల్ కృష్ణ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కెరీర్..
బాలీవుడ్ మూవీ ‘శుద్ధ దేశి రొమాన్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన వాణి కపూర్‌కు ఆ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది.

ఎఫ్‌హెచ్‌ఎం కోసం ఫోజులు
సక్సెస్‌లో ఉన్నపుడు పాపులారిటీ పెంచుకోవాలనే ఆలోచన చేసిన వాణి కపూర్ సినిమా రంగంలో తన జోరు కొనసాగించాలని నిర్ణయించుకున్న ఆమె.....ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ జనవరి 2014 ఎడిషన్‌పై హాట్ అండ్ సెక్సీ ఫోజులతో దర్శనమిచ్చింది.

వాణి కపూర్
వాణి కపూర్ వాణి కపూర్ ఢిల్లీకి చెందిన భామ. ఆమె వయసు 25. ఆగస్టు 23, 1988లో జన్మించింది.

తల్లిదండ్రులు
వాణి కపూర్ పంజాబీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆమె తండ్రి ఫర్నీచర్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తాడు. ఆమె తల్లి కొంతకాలం టీచర్‌గా పని చేసి ప్రస్తుతం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతోంది.

మోడలింగ్
తొలుత మోడలింగ్ రంగంలో రాణించిన వాణి కపూర్ ఆ తర్వాత.....యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించి బాలీవుడ్ మూవీ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

మూడు సినిమాల డీల్
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థతో వాణి కపూర్ మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే ‘శుద్ద్ దేశీ రొమాన్స్' చిత్రంలో నటించగా...ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘ఆహా కళ్యాణం' చిత్రంలో నటిస్తోంది.

బాలీవుడ్ అవకాశాలు
వాణి కపూర్ అందచందాలు, యాక్టింగ్ టాలెంటుకు ఇప్పటికే పలువురు ఫిల్మ్ మేకర్స్ ఫిదా అయ్యారు. ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఆహా కళ్యాణం
ఆమె నటిస్తున్న తెలుగు/తమిళ చిత్రం ‘ఆహా కళ్యాణం' సినిమా విషయానికొస్తే....హిందీలో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బాజా భారత్' చిత్రానికి ఇది రీమేక్. నాని హీరో. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











