మేగజైన్‌పై హాట్ బ్యూటీ మత్తెక్కించే ఫోజులు (ఫోటోలు)
ముంబై: బాలీవుడ్ మూవీ 'శుద్ధ దేశి రొమాన్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన వాణి కపూర్‌కు ఆ సినిమా విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇదే అదునుగా సినిమా రంగంలో తన జోరు కొనసాగించాలని నిర్ణయించుకున్న ఆమె.....ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ జనవరి 2014 ఎడిషన్‌పై హాట్ అండ్ సెక్సీ ఫోజులతో దర్శనమిచ్చింది.
మేగజైన్‌పై ఆమె అప్పియరెన్స్ ఎంతో హాట్ హాట్‌గా ఉండటంతో......వాణి కపూర్ గ్లామర్ గురించి సర్వత్రా చర్చనీయాంశం అయింది. పలువురు ఫిల్మ్ మేకర్స్ కూడా ఆమె సౌందర్యం, పెర్ఫార్మెన్స్ తనకు సినిమాలకు ఏ మేరకు ఉపయోగ పడతాయి అనే విషయమై విశ్లేషించుకుంటున్నారట.
మరో ముఖ్య విషయం ఏమిటంటే...అమ్మడు త్వరలో తెలుగు సినిమాలో కనిపించబోతోంది. నాని హీరోగా తెరకెక్కుతున్న 'ఆహా కళ్యాణం' సినిమాలో వాణి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వాణి కపూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో చూద్దాం.

వాణి కపూర్
వాణి కపూర్ ఢిల్లీకి చెందిన భామ. ఆమె వయసు 25. ఆగస్టు 23, 1988లో జన్మించింది.

తల్లిదండ్రులు
వాణి కపూర్ పంజాబీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆమె తండ్రి ఫర్నీచర్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తాడు. ఆమె తల్లి కొంతకాలం టీచర్‌గా పని చేసి ప్రస్తుతం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతోంది.

మోడలింగ్
తొలుత మోడలింగ్ రంగంలో రాణించిన వాణి కపూర్ ఆ తర్వాత.....యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించి బాలీవుడ్ మూవీ ‘శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

మూడు సినిమాల డీల్
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థతో వాణి కపూర్ మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే ‘శుద్ద్ దేశీ రొమాన్స్' చిత్రంలో నటించగా...ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘ఆహా కళ్యాణం' చిత్రంలో నటిస్తోంది.

బాలీవుడ్ అవకాశాలు
వాణి కపూర్ అందచందాలు, యాక్టింగ్ టాలెంటుకు ఇప్పటికే పలువురు ఫిల్మ్ మేకర్స్ ఫిదా అయ్యారు. ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఆహా కళ్యాణం
ఆమె నటిస్తున్న తెలుగు/తమిళ చిత్రం ‘ఆహా కళ్యాణం' సినిమా విషయానికొస్తే....హిందీలో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బాజా భారత్' చిత్రానికి ఇది రీమేక్. నాని హీరో. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











