యూట్యూబ్‌లో వరుణ్ తేజ్, సాయిపల్లవి సంచలనం.. ధనుష్ 'కొలవెరి' రికార్డ్ బ్రేక్!

Recommended Video

Vachinde Song Creates Sensational Record In YouTube | Filmibeat Telugu

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన ఫిదా చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం యువతని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి నటన, సంగీతం ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. వరుణ్ తేజ్ కెరీర్ లో ఫిదా తొలి విజయం. ఈ చిత్రంతో సాయి పల్లవి తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా ఫిదా చిత్రం పేరు మీద మరో రికార్డ్ నమోదైంది.

ఏడేళ్ల క్రితం

ఏడేళ్ల క్రితం

ఏడేళ్ల క్రితం యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అద్భుతమైన మాయ చేశాడు. ధునుష్, శృతి హాసన్ జంటగా నటించిన 3 చిత్రం 2012లో విడుదలయింది. ఈ చిత్రంలోని కొలవెరి అనే పాట యూట్యూబ్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రపంచం మొత్తం ఈ పాట ట్రెండింగ్ గా నిలిచింది. ఈ ఒక్క సాంగ్ తో అనిరుద్ క్రేజీ సంగీత దర్శకుడిగా మారిపోయాడు.

రికార్డు గల్లంతు

రికార్డు గల్లంతు

కొలవెరి సాంగ్ ని ఇప్పటి వరకు యూట్యూబ్ లో 172 మిలియన్ల మంది వీక్షించారు. ఈ పాటకు 1.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. అప్పట్లో కొలవెరి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్. తాజాగా ఈ రికార్డు గల్లంతైంది. ఫిదా చిత్రంలోని సాయి పల్లవి, వరుణ్ తేజ్ సాంగ్ 'వచ్చిండే' కొలవెరి రికార్డ్ ని బ్రేక్ చేసింది. వచ్చిండే 173 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

సాయి పల్లవి స్టెప్పులు

సాయి పల్లవి స్టెప్పులు


వచ్చిండే సాంగ్ లో సాయిపల్లవి స్టెప్పులు చూపు తిప్పలేని విధంగా ఉంటాయి. సంగీత దర్శకుడు శక్తికాంత్ ఈ పాటకు బాణీలు సమకూర్చారు. మధుప్రియ అద్భుతంగా పాడగా.. సాయి పల్లవి తన డాన్స్ తో సాంగ్ ని మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది. అందమైన హావ భావాలూ పలికిస్తూ, లయ బద్దంగా సాయిపల్లవి వేసిన స్టెప్పులకు యువత ఫిదా అయ్యారు. అందుకే ఈ రేంజ్ లో ఈ పాట దూసుకుపోతోంది. సౌత్ లో ఎక్కువమంది వీక్షించిన పాటగా రికార్డు నెలకొల్పింది.

సంచలన సంగీత దర్శకుడిగా

సంచలన సంగీత దర్శకుడిగా

ఇక కొలవెరి సాంగ్ సాధించిన విజయాల్ని కొట్టిపారేయలేం. అప్పట్లోనే ఈ సాంగ్ సృష్టించిన సంచలనానికి సయూట్యూబ్ యాజమాన్యం సైతం షాక్ కి గురైంది. అనిరుద్ ఈ పాటతో చాలా మంది యువతకు అభిమాన సంగీత దర్శకుడిగా మారిపోయాడు. యువతని ఆకట్టుకునే సరికొత్త ఆల్బమ్స్ అందిస్తూ ధనుష్ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X